Saturday, March 14, 2026
Homeస్పోర్ట్స్Team India (Women): ఇంగ్లాండ్ టూర్ కు జులన్ గోస్వామి

Team India (Women): ఇంగ్లాండ్ టూర్ కు జులన్ గోస్వామి

వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో ఆ దేశంలో జరగనున్న  టి20,  వన్డే సిరీస్ కు భారత మహిళా క్రికెట్ జట్టును బిసిసిఐ ప్రకటించింది. ఇండియా- ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య మూడు టి 20లు, మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. హార్మన్ ప్రీత్ కౌర్  కెప్టెన్ గా, స్మృతి మందానా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు.

వెటరన్ పేసర్ జులన్ గోస్వామికి వన్డే జట్టులో చోటు లభించగా, కిరణ్ ప్రభు నవ గిరే టి 20 జట్టుకు ఎంపికైంది. యస్తికా భాటియా, హర్లీన్ డియోల్ లపై వేటు వేశారు.

జట్టు వివరాలు:

టి 20: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందానా  (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ,  దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్, రోడ్రిగ్యూస్, స్నేహ రానా,  రేణుకా ఠాకూర్, మేఘనా సింగ్,  రాధా యాదవ్, సబ్బినేని మేఘన, తానియా సప్నా భాటియా, రాజేశ్వరి గైక్వాడ్, హేమలత, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్, కిరణ్ ప్రభు నవ్ గిరే

వన్డే: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందానా  (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన,  దీప్తి శర్మ, తానియా సప్నా భాటియా, పూజ వస్త్రాకర్,  స్నేహ రానా,  రేణుకా ఠాకూర్, మేఘనా సింగ్,  రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, హేమలత, సిమ్రాన్ బహదూర్, జులన్ గోస్వామి, రోడ్రిగ్యూస్

మ్యాచ్ ల వివరాలు:

వన్డేలు  – సెప్టెంబర్ 10, 13, 15 తేదీల్లో దుర్హమ్, డేర్బీ, బ్రిస్టల్ వేదికల్లో….

టి 20లు – సెప్టెంబర్ 18, 21, 24  తేదీల్లో హావ్, కేన్టర్ బారీ, లార్డ్స్ వేదికల్లో జరగనున్నాయి.

ఇటీవలే ముగిసిన కామన్ వెల్త్ గేమ్స్ లో ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై రజత పతకం దక్కించుకున్న ఇండియా మహిళల జట్టు సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ ను ఓడించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular