Saturday, March 14, 2026
Homeసినిమాతెలుగు తెరకి మరో స్టార్ విలన్! 

తెలుగు తెరకి మరో స్టార్ విలన్! 

తెలుగు తెరపై కొత్త విలన్స్ కి కొదవ లేదు. గతంలో బాలీవుడ్ నుంచి ఎక్కువమంది విలన్స్ టాలీవుడ్ కి పరిచయమయ్యేవారు. ఆ తరువాత కాలంలో కోలీవుడ్ నుంచి విలన్స్ రావడం కూడా జరిగింది. ఇక ఈ మధ్య కాలంలో హీరోలు సైతం విలన్ గా కనిపించడానికి ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. టాలీవుడ్ లో జగపతిబాబు విలన్ గా ఎంట్రీ ఇచ్చి, స్టార్ విలన్ గా బిజీ అయ్యారు. ఇప్పుడు ఇతర భాషల్లోని హీరోలు సైతం అడపా దడపా విలన్ గా చేయడానికి వెనుకాడటం లేదు.

బాలీవుడ్ లో సంజయ్ దత్ .. కోలీవుడ్ లో చూసుకుంటే కమల్ .. సూర్య సైతం ఈ జాబితాలో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మలయాళంలో మంచి స్టార్ డమ్ ఉన్నవారు సైతం విలన్స్ గా ఇక్కడ రంగంలోకి దిగిపోయారు. తమదైన ప్రత్యేకతతో ఇక్కడి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు జోజు జార్జ్ కూడా ఇదే బాటలో ఒక అడుగు ముందుకు వేశాడు. జోజు జార్జ్ కి మలయాళంలో ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పుకోవలసిన పనిలేదు. సుదీర్ఘమైన ఆయన కెరియర్ లో ఎన్నో హిట్లు కనిపిస్తాయి.

అయితే ఇంతకుముందు తెలుగు ప్రేక్షకులకు ఆయన పెద్దగా పరిచయం లేదు. ఆయన సినిమాలేవీ ఇక్కడ అనువాదాలుగా రాలేదు. ఈ మధ్య కాలంలో ఓటీటీ సినిమాల కారణంగానే  ఆయన తెలుగు ప్రేక్షకులకు తెలిశాడు. ఇప్పుడు ఆయన కూడా నేరుగా ఇక్కడి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా చేసిన ‘ఆదికేశవ‘ సినిమా ఈ నెల 24వ తేదీన థియేటర్లకు వస్తోంది. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా జోజు జార్జ్ కనిపించనున్నాడు. ఈ సినిమా తరువాత విలన్ గా ఆయన జోరు ఇక్కడ కొనసాగే అవకాశం లేకపోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular