Saturday, November 23, 2024
HomeTrending Newsఏటీఎం అంటే అవినీతి తాత మోదీ - మంత్రి శ్రీనివాస్

ఏటీఎం అంటే అవినీతి తాత మోదీ – మంత్రి శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ పులి లాంటోడు.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ అన్నా.. కేసీఆర్‌కు తెలంగాణ అన్నా పంచ ప్రాణాలు.. కేసీఆర్‌ను ఎవ్వ‌రూ ఓడించ‌లేరు అని శ్రీనివాస్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. ముఖ్య‌మంత్రిని, మంత్రుల‌ను వాడు, వీడు అంటే నాలుక చీరేస్తాం అని బండి సంజ‌య్‌ను మంత్రి హెచ్చ‌రించారు. టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యేలు ఆళ్ల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, అంజ‌య్య యాద‌వ్, ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డితో క‌లిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. పాద‌యాత్ర‌ల పేరిట ప‌చ్చ‌బ‌డ్డ పాల‌మూరును విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మ‌తం, కులం పేరిట రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాద‌న్నారు. 2000లో మూడు రాష్ట్రాలు ఇచ్చిన‌ప్పుడే తెలంగాణ ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింద‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. తెలంగాణ పుట్టుక నుంచే బీజేపీ ఈ ప్రాంతం పై వివక్ష ప్రదర్శిస్తోంద‌న్నారు. రాష్ట్రం రాగానే పోలవరానికి ఏడు మండలాలు, సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు బీజేపీ ప్ర‌భుత్వం కట్టబెట్టింద‌ని మంత్రి గుర్తు చేశారు.

బండి సంజ‌య్ ఓ లుచ్చా..
సిగ్గు, శరం, లజ్జ లేకుండా బీజేపీ నేతలు నిన్న పాలమూరు లో మాట్లాడారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వ‌జ‌మెత్తారు. న‌త్తితో మాట్లాడుతున్న సంజ‌య్.. ఏం చెబుతున్నాడో ప్ర‌జ‌ల‌కు అర్థం కావ‌డం లేద‌న్నారు. సంజ‌య్ ఓ లుచ్చా లాగా, వీధిరౌడీలా మాట్లాడుతున్నాడ‌ని నిప్పులు చెరిగారు. ఆయ‌న‌కు బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చిన వాడేవ‌డో అని విమ‌ర్శించారు. సీఎం, మంత్రులను పట్టుకుని వాడు వీడు అంటావారా సంజయ్.. ఎవడివిరా నీవు, నీకెవడ్రా సంస్కారం నేర్పింది అని దుమ్ముదులిపారు.

జేపీ న‌డ్డాకు క‌నీస జ్ఞానం ఉందా..?
నిన్న పాల‌మూరు స‌భ‌లో జేపీ న‌డ్డా కాళేశ్వ‌రంపై అవ‌గాహ‌న లేకుండా మాట్లాడ‌ర‌ని శ్రీనివాస్ గౌడ్ ధ్వ‌జ‌మెత్తారు. కాళేశ్వరం రూ. 20 వేల కోట్లతో పూర్తయ్యేదని న‌డ్డా పచ్చి అబద్ధం మాట్లాడారు. ప్రపంచంలో ఎత్తయిన ఎత్తిపోతల పథకం రూ. 20 వేల కోట్లతో పూర్తవుతుందా? అసలు నడ్డాకు కనీస జ్ఞానం ఉందా? అని ప్ర‌శ్నించారు. పార్లమెంట్‌లో తెలంగాణ ప్ర‌భుత్వానికి వస్తున్న ప్రశంసలు నడ్డాకు కనిపించడం లేదా? పది మంది దాకా కేంద్రమంత్రులు వచ్చి తెలంగాణ పథకాలను పొగిడిన విష‌యం న‌డ్డా మ‌రిచిపోయారా? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

బీజేపీ దేశం పాలిట ఏటీఎం అయింది..
బీజేపీ దేశం పాలిట ఏటీఎం అయింద‌ని శ్రీనివాస్ గౌడ్ విమ‌ర్శించారు. ఏటీఎం అంటే అమ్మేయడం, తాకట్టు పెట్టడం, మోదెయ్యడం.. ఏటీఎం అంటే అవినీతి తాత మోదీ, ఏటీఎం అంటే ఆదానీ తొత్తు మోదీ అని విమ‌ర్శించారు. కాళేశ్వ‌రం టీఆర్ఎస్‌కు ఏటీఎం అయితే.. దేశంలోని ప్రాజెక్టుల‌న్నీ బీజేపీకి ఏటీఎంలా అని ప్ర‌శ్నించారు.

Also Read : 

న బూతో న భవిష్యతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్