Saturday, March 14, 2026
Homeసినిమాఎన్టీఆర్ కి చాలా గ్యాప్ వచ్చేసిందే!

ఎన్టీఆర్ కి చాలా గ్యాప్ వచ్చేసిందే!

ఎన్టీఆర్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా కోసం చాలా సమయాన్ని కేటాయించాడు. ‘అరవింద సమేత’ తరువాత ఆయన ఆర్ ఆర్ ఆర్ పైనే దృష్టి పెట్టాడు. అందువలన ప్రేక్షకుల ముందుకు వచ్చేవరకూ మధ్యలో ఆయన సినిమా ఏదీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత కూడా ఇంతవరకూ ఆయన మరో ప్రాజెక్టు పట్టాలపైకి రాలేదు. ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ నెల 25వ తేదీతో ఏడాది అవుతుంది.

నిజానికి ఎన్టీఆర్ ఆ సినిమా పూర్తికాగానే కొరటాలను తీసుకుని సెట్స్ పైకి వెళ్లాలని అనుకున్నాడు. కానీ కొరటాల స్క్రిప్ట్ విషయంలో ఆయన సంతృప్తి చెందడానికి చాలా కాలం పట్టింది. ఇక ఈ ఫిబ్రవరిలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ కూడా ఒక ఈవెంటులో ఈ మాట చెప్పాడు. కానీ తారకరత్న మరణం కారణంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అందువలన మరింత ఆలస్యమైంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఈ నెల 18వ తేదీన నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగుకు వెళ్లనున్నారు. వచ్చే ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నటు ముందుగానే ప్రకటించారు. అంటే ఎన్టీఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో ఏడాది పడుతుంది. ఒకరకంగా ఆయనకి అభిమానులతో చాలా గ్యాప్ వచ్చేసినట్టే. అదే ఇప్పుడు వారికి నిరాశను కలిగిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular