Saturday, April 20, 2024
Homeసినిమాఈసారైనా 'పుష్ప 2' టీజర్ వస్తుందా..?

ఈసారైనా ‘పుష్ప 2’ టీజర్ వస్తుందా..?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. బాలీవుడ్ లో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. దీంతో ‘పుష్ప 2’ సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2 చిత్రం పై ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ విషయంలో ఎలాంటి పరిమితులు పెట్టుకోకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

సుకుమార్.. పుష్ప 2 కోసం ఎన్ని అంచనాలు అయినా పెట్టుకోండి. ఆ అంచనాలను అందుకుంటాం అంటున్నారు. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణలో జాయిన్ అయ్యారు అల్లు అర్జున్. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ రాబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. బన్నీ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పుష్ప 2 ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఇంతకీ ఎప్పుడంటే… అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న పుష్ప 2 ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారట. అయితే ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే… అవతార్ 2 రిలీజ్ టైమ్ లో పుష్ప 2 టీజర్ రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆ సినిమాతో పాటు రిలీజ్ చేస్తే.. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనుకున్నారు కానీ.. కొన్ని కారణాల రిలీజ్ చేయలేదు. ఈసారి బన్నీ పుట్టినరోజుకు పుష్ప టీజర్ రావడం ఖాయం అనే టాక్ బలంగా వినిపిస్తుంది. దీంతో బన్నీ అభిమానులు ఎప్పుడెప్పుడు ఏప్రిల్ 8 వస్తుందా.. పుష్ప 2 టీజర్ వస్తుందా అని ఇప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి… మేకర్స్ త్వరలోనే పుష్ప 2 గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read : ‘పుష్ప 2’ లేటెస్ట్ అప్ డేట్ ఏంటి..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్