Saturday, July 27, 2024
Homeసినిమాఎన్టీఆర్ మూవీలో విలన్ గా నటించే స్టార్ ఎవరు..?

ఎన్టీఆర్ మూవీలో విలన్ గా నటించే స్టార్ ఎవరు..?

ఎన్టీఆర్,  ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబర్ స్టార్ అయిపోయారు. అందుకనే ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు టాలీవుడ్, బాలీవుడ్ మేకర్సే కాదు.. హాలీవుడ్ మేకర్స్ కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. నెక్ట్స్ మూవీని ఎన్టీఆర్.. కొరటాల శివతో చేస్తున్నారు. ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది కానీ.. కొన్ని కారణాల వలన వాయిదాపడుతూ వచ్చింది. ఇప్పుడు అంతా సెట్ అయ్యింది. ఈ నెలలోనే ఈ మూవీ షూటింగ్ గ్రాండ్ గా స్టార్ట్ చేయనున్నారు.

ఇందులో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటించనుందని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. మరో విషయం ఏంటంటే.. ఇందులో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఆ పాత్రను బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తో చేయించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆతర్వాత సంజయ్ దత్ కాదు.. సైఫ్ ఆలీఖాన్ తో చేయించనున్నారని టాక్ వచ్చింది. అలాగే కోలీవుడ్ స్టార్ విక్రమ్ పేరు కూడా గట్టిగానే వినిపించింది. మొత్తానికి విలన్ పాత్రను మాత్రం వేరే లాంగ్వేజ్ లో ఉన్న స్టార్ తోనే చేయించాలని ఫిక్స్ అయ్యారట.

ఎన్టీఆర్ ఆస్కార్ కోసం అమెరికా వెళ్లారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత విలన్ ఎవరు అనేది ఫైనల్ చేస్తారట. ఈ చిత్రాన్ని మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడం.. జనతా గ్యారేజ్ కాంబోలో మూవీ కావడంతో అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. భారీ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రూపొందనుంది. మరి.. ఎన్టీఆర్, కొరటాల కలిసి ఏ రేంజ్ సక్సెస్ అందిస్తారో.. ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్