విజయవాడ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హీరో ఎన్టీఆర్ స్పందించారు. పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ కీర్తిని, గౌరవాన్ని చేరిపివేయలేరని వ్యాఖ్యానించాడు.
“NTR, YSR ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవ YSR స్థాయిని పెంచదు. NTR స్థాయిని తగ్గించదు. విశ్వ విద్యాలయానికి పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపి వేయలేరు” అంటూ ట్వీట్ చేశాడు.
కాగా ఈ ట్వీట్ పై టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నిర్ణయాన్ని నేరుగా వ్యతిరేకించకుండా.. డొంక తిరుగుడు వ్యవహారంలాగా అయన స్పందన ఉందని తెలుగుదేశం విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్ పేరు మార్పుపై స్పందించాల్సింది పోయి వైఎస్సార్ కూడా గొప్ప నాయకుడే అంటూ పొగడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
Also Read : గవర్నర్ కు తెలియకుండానే మార్చారు: బాబు