Sunday, June 14, 2026
HomeసినిమాAdhurs Re Release: ఎన్టీఆర్ 'ఆదుర్స్' రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారా..?

Adhurs Re Release: ఎన్టీఆర్ ‘ఆదుర్స్’ రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారా..?

ఇప్పుడు ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు పోకిరి సినిమా నుంచి ఈ రీ రిలీజ్ ల ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. బిజినెస్ మేన్, జల్సా, సింహాద్రి, యోగి, గుడుంబా శంకర్… ఇలా అప్పటి సినిమాలు ఇప్పుడు థియేటర్లో రిలీజ్ కావడం.. ప్రేక్షకాభిమానులు విశేషంగా ఆదరించడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ కెరీర్ లో మరిచిపోలేని ‘అదుర్స్’ సినిమాని రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య చిత్రీకరించిన కామెడీ సీన్స్ అయితే.. ఓ రేంజ్ లో ఉంటాయి.

ఇప్పుడు టీవీలో అదుర్స్ మూవీ వచ్చినా టాప్ రేటింగ్ వస్తుంటుంది. దీనిని బట్టి ఈ సినిమా ఎంతగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే… అనూహ్య స్పందన వస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ చిత్రాన్ని నవంబర్ లో రీ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలో అదుర్స్ రీ రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటిస్తారని సమాచారం. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత వార్ 2 మూవీ చేయనున్నారు. ఆతర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular