Saturday, January 18, 2025
HomeTrending News'దేవర' వేరే లెవెల్ అనేది ఎన్టీఆర్ మాట!

‘దేవర’ వేరే లెవెల్ అనేది ఎన్టీఆర్ మాట!

ఎన్టీఆర్ అభిమానులంతా ఇప్పుడు ‘దేవర’ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, అభిమానులలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఓపెనింగ్స్ నుంచే కొత్త రికార్డులు సెట్ చేయడం మొదలు పెడుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27న థియేటర్లకు రావడానికి ఈ సినిమా రెడీ అవుతోంది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా కోసం ఆ స్థాయిలోనే ఆయన ప్రమోషన్స్ లో కనిపిస్తున్నాడు. తాజాగా ఆయన హిందీ మీడియాతో మాట్లాడుతూ .. ” సినిమాలో మూడొంతుల కథ అంతా ఒక ఎత్తు. చివరి 30 – 40 నిమిషాలలో నడిచే కథ మరో ఎత్తు. ఆడియన్స్ ఎవరూ గెస్ చేయలేని మలుపులతో ఈ కథ సాగుతుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు” అన్నాడు.

ఎన్టీఆర్ వ్యాఖ్యలతో అభిమానుల్లో మరింత హుషారు పెరిగింది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచిపోవడం ఖాయమనే నమ్మకంతో వాళ్లు ఉన్నారు. సినిమాలో జాన్వీ కపూర్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. అనిరుధ్ అందించిన బాణీలు కూడా జనంలోకి దూసుకుపోయాయి. మ్యూజికల్ గా ఈ సినిమా ఆడియన్స్ ను అలరిస్తుందనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి అభిమానులు ఆశించినట్టుగా ఈ సినిమా ఏ స్థాయిలో సంచలనాన్ని సృష్టిస్తుందో!

RELATED ARTICLES

Most Popular

న్యూస్