Saturday, March 7, 2026
Homeసినిమాకొరటాల, ప్రశాంత్ లకు జునియర్ గ్రీన్ సిగ్నల్

కొరటాల, ప్రశాంత్ లకు జునియర్ గ్రీన్ సిగ్నల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కరోనా వలన షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇక ఈ సంవత్సరం అక్టోబర్ 13న రావాల్సిన ఆర్ఆర్ఆర్ వచ్చే సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ఇటీవల ఇంటర్నేషనల్ వెబ్ సైట్ కి ఇంటర్ వ్యూ ఇచ్చారు. ఇందులో ఆర్ఆర్ఆర్ గురించి తను చేయబోయే సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

ఇంతకీ ఏం చెప్పారంటే.. ఆర్ఆర్ఆర్ ని ఓటీటీలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా అంటే.. ఎట్టి పరిస్థితుల్లోను ఓటీటీలో రిలీజ్ చేయాలనుకోవడం లేదు. ఇలాంటి సినిమాను బిగ్ స్ర్కీన్ పైనే చూడాలి అని చెప్పారు. తదుపరి చిత్రాల గురించి అడిగితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివతో సినిమా చేస్తానన్నారు. ఆతర్వాత కేజీఎఫ్‌ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తానన్నారు.

అయితే.. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు స్టోరీ రెడీ చేస్తున్నాడు. ఇటీవల ఎన్టీఆర్ కు కథ చెప్పడం కూడా జరిగింది. అయితే.. ఎన్టీఆర్ మాత్రం బుచ్చిబాబుతో సినిమా గురించి ప్రస్తావించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular