Saturday, January 18, 2025
Homeసినిమాకరోనా బారిన పడ్డ జూనియర్

కరోనా బారిన పడ్డ జూనియర్

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. దీనికి సామాన్యుడు అయినా ఒకటే.. అసామాన్యుడు అయినా ఓకే. అందర్నీ సమానంగా చూస్తుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, రాజమౌళి, బండ్ల గణేష్, పూజా హేగ్డే.. ఇలా చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారినపడ్డారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. తనకు కరోనా పాజిటివ్ అని.. అయితే ఎవరూ కంగారు పడద్దు. నేను బాగానే ఉన్నాను అని చెప్పారు.

మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. డాక్టర్ల పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా నన్ను కలిసి వాళ్లు కరోనా టెస్ట్ చేయించుకోండి. జాగ్రత్తగా ఉండండి అని ఎన్టీఆర్ తెలియచేశారు. ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా తనకు కరోనా పాజిటివ్ అని చెప్పగానే.. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఎన్టీఆర్ త్వరలోనే కోలుకోవాలని కోరుకుంటున్నామని తెలియచేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్