సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గిరీష్ థకోరల్ నానావతి (86) శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు గుండెపోటుతో ఢిల్లీలో కన్నుమూశారు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002లో జరిగిన గుజరాత్ మత ఘర్షణల కేసులను ఆయన విచారించారు. తొలుత బాంబే హైకోర్టులో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయిన నానావతి 1979లో గుజరాత్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
1994లో ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 1995 మార్చిలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన నానావతి 2వేల సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. 2002 గోద్రాఅల్లర్లపై విచారణ జరిపిన జస్టిస్ నానావతి, జస్టిస్ అక్షయ్ మెహతాలు 2014లో తమ తుది నివేదికను అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్‌కు అందచేశారు. గోద్రా హింసాకాండలో దాదాపు రెండు వేల మంది పైగా చనిపోయారు. నాటి ఘర్షణల్లో ప్రధానంగా మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారే ఎక్కువగా మరణించిన సంగతి తెలిసిందే.