Monday, March 9, 2026
HomeTrending NewsCanada: కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో విడాకులు

Canada: కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో విడాకులు

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ 18 ఏండ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పారు. పలుమార్లు చర్చించుకున్న తర్వాతే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇన్‌స్టాగ్రాం వేదికగా వెళ్లడించారు. చట్టబద్ధంగా విడిపోయే ఒప్పందంపై జస్టిన్‌ ట్రుడో, సోఫీ గ్రెగోయ్‌రీ ట్రుడో దంపతులు ఇప్పటికే సంతకం చేశారని ప్రధాని కార్యాలయం తెలిపింది.
2005, మే నెలలో జస్టిన్‌ ట్రుడో, సోఫీ గ్రెగోయ్‌రీ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం విడిపోతున్నప్పటికీ వారి సంరక్షణను తామిద్దరం కలిసే చూసుంటామని ట్రుడో దంపతులు వెల్లడించారు. ఎప్పటిలాగానే తమ మధ్య ప్రేమ, పరస్పర గౌరవం ఉంటాయని తెలిపారు. సోఫీ ఇప్పటికే ఒట్టావాలోని మరో నివాసానికి వెళ్లిపోయారని అధికారులు పేర్కొన్నారు. ప్రధాని పదవిలో ఉండగా భార్యకు విడాకులు ప్రకటించిన ప్రధానికిగా జస్టిన్‌ ట్రుడో నిలిచారు. మొదటి వ్యక్తి ఆయన తండ్రి పియెర్‌ ట్రుడో కావడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular