Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్రాహూల్ సెంచరీ : ఇండియా 276/3

రాహూల్ సెంచరీ : ఇండియా 276/3

ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య చారిత్రక లార్డ్స్ మైదానంలో మొదలైన రెండో టెస్ట్ తొలిరోజు ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది. ఓపెనర్ కే ఎల్ రాహుల్ 127 పరుగులతో అజేయంగా నిలిచారు. రోహిత్ శర్మ 1 సిక్సర్,  11 ఫోర్లతో 83 పరుగులు చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి  3 ఫోర్లతో 43 పరుగులు చేశాడు. తొలి టెస్ట్ లో నిరాశ పరిచిన పుజారా ఈ టెస్టులోనూ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. రాహుల్, రేహానే క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ కు 2, ఓలి రాబిన్సన్ కు ఒక వికెట్ లభించింది.

అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బౌలింగ్ ఎంచుకున్నాడు.  ఇండియా జట్టులు కేవలం ఒకే మార్పు చేసింది. శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఇషాంత్ శర్మ జట్టులో స్థానం లభించింది. ఇంగ్లాండ్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడిన బ్రాడ్ స్థానంలో వుడ్, మొయిన్ అలీ, హమీద్ లు జట్టులో చేరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్