Tuesday, April 16, 2024
Homeసినిమా ‘పెళ్లి సంద‌D’లో వ‌శిష్ట‌గా ద‌ర్శ‌కేంద్రుడు

 ‘పెళ్లి సంద‌D’లో వ‌శిష్ట‌గా ద‌ర్శ‌కేంద్రుడు

ద‌ర్శ‌కేంద్రుడు, శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్రరావు .. తెలుగు సినీ ప్రేక్ష‌కుడికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. తెలుగు సినిమాను క‌మ‌ర్షియ‌ల్ పంథాను మ‌రో మెట్టు ఎక్కించిన ఈ స్టార్ డైరెక్ట‌ర్ విక్ట‌రీ వెంక‌టేష్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, లేడీ సూప‌ర్‌స్టార్ శ్రీదేవి, శిల్పాశెట్టి, ఖుష్బూ, ట‌బు, తాప్సీ వంటి ఎంద‌రో స్టార్స్ ను వెండితెర‌కు త‌న గోల్డెన్ హ్యాండ్‌తో ప‌రిచ‌యం చేసి సూప‌ర్ డూప‌ర్ హిట్స్‌, బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించారు. శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడిగా తెలుగు సినిమా చ‌రిత్ర‌లో త‌నదైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న రాఘ‌వేంద్ర‌రావు, తొలిసారి వెండితెర‌ పై న‌టుడిగా మెప్పించ‌నున్నారు.

తన ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, శిష్యురాలు గౌరి రోణంకి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘పెళ్లి సంద‌D’ లో రాఘవేంద్ర‌రావు తొలిసారి న‌టిస్తుండ‌టం విశేషం. వ‌శిష్ఠ అనే పాత్ర‌ను అయన పోషిస్తున్నారు.  దీనికి సంబంధించిన స్పెష‌ల్ ప్రోమోను శుక్ర‌వారం రోజున రాఘవేంద్ర‌రావు శిష్యుడు.. పాన్ ఇండియా స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ‘వంద సినిమాలను డైరెక్ట్ చేసిన తర్వాత మా మౌన ముని కెమెరా ముందుకు వస్తున్నారు.‘పెళ్లి సంద‌D’లో వశిష్ఠ పాత్రధారిగా రాఘవేంద్రరావుగారి ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నాం’’ అంటూ త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు.

ఈ స్పెషల్ ప్రోమోలో కె.రాఘవేంద్రరావు సరికొత్త లుక్, ఎన‌ర్జీతో క‌నిపిస్తున్నారు. పిల్ల‌ల‌తో ఆట‌లాడ‌టం, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, శ్రీనివాస్ రెడ్డి పాత్ర‌ల‌తో మాట్లాడేలా ఉండ‌టం, చివ‌ర‌ల్లో రోష‌న్‌తో క‌లిసి న‌డిచే సీన్ ఇలాంటి వాటిని ప్రోమోలో చూడొచ్చు. మ‌రి వ‌శిష్ఠ‌గా రాఘ‌వేంద్ర‌రావు ఎలా మెప్పించారో తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు డైరెక్ట‌ర్ గౌరి రోణంకి. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్లపై  కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ‘పెళ్లి సంద‌D’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్