Friday, March 13, 2026
Homeసినిమాదర్శకేంద్రుడు విడుదల చేసిన ‘జాతీయ రహదారి’ ట్రైలర్

దర్శకేంద్రుడు విడుదల చేసిన ‘జాతీయ రహదారి’ ట్రైలర్

దర్శకుడు నరసింహ నంది తెరకెక్కించిన తాజా చిత్రం ‘జాతీయ రహదారి’. మధు చిట్టె, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్  నందిరెడ్డి. ధక్షిత్ రెడ్ది, అభి, తెల్జెరు మల్లెష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ‘జాతీయ రహదారి’ ట్రైలర్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రిలీజ్ చేశారు.

రాఘవేంద్రరావు మాట్లాడుతూ… “జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలో తీసిన ‘జాతీయ రహదారి’ థియేట్రికల్ ట్రైలర్ ను ఇప్పుడే విడుదల చేశాను. చాలా గొప్పగా ఉంది. హృదయాన్ని హత్తుకునేలా ఉంది. నిర్మాత మా రామసత్యనారయణకు ఈ సినిమా ఒక మైల్ స్టోన్ గా నిలుస్తోంది” అన్నారు.

నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ “నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, దర్శకులలో ఇంద్రుడు దర్శకేంద్రుడు శ్రీ రాఘవేంద్రరావు గారి చేతులు మీదుగా మా ‘జాతీయ రహదారి’ ట్రైలర్ విడుదల కావటం చాలా అదృష్టం. ఈనెల 10వ తేదీన థియేటర్లలో ఈ చిత్రం విడుదల అవుతుంది. ఈ సినిమా చూసి నన్ను,  అద్భుతంగా తెరకెక్కించిన మా దర్శకుడిని నరసింహ నందిని అభినందించండి. నా పుట్టినరోజున ఈ ఫంక్షన్ జరగటం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

“నా జీవిత కల నెరవేరింది. నా గురువు బి. గోపాల్ గారికి గురువు రాఘవేంద్రరావు గారు ట్రైలర్ చూసి..నచ్చి సినిమా కూడా చూస్తాను అన్నారు. నా ఆనందానికి అవధులు లేవు. ఇంత కంటే గొప్ప విజయం ఏమీలేదు. నన్ను నమ్మి నాతో సినిమా తీసిన నా నిర్మాత రామ సత్యనారాయణ గారికి డబ్బులు..అవార్డ్స్ కూడా వస్తాయి” అని దర్శకుడు నరసింహ నంది అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular