Saturday, July 27, 2024
HomeTrending Newsమద్యం కోసం ఉద్యమమా?: డిప్యూటీ సిఎం

మద్యం కోసం ఉద్యమమా?: డిప్యూటీ సిఎం

నవరత్నాలు అమలు ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల హృదయాలను దోచుకున్నారని ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్, వాణిజ్య పన్నులు) కె. నారాయణ స్వామి అన్నారు. ఉద్యమం అంటే పేదల ఇళ్ళ స్థలాల కోసం లేదా రైతులు, పేదల సంక్షేమం కోసం చేయాలి తప్ప మద్యంపై ఉద్యమం చేయడం ఏమిటని ప్రతిపక్షాల తీరును విమర్శించారు.

ప్రస్తుతం ఉన్నమద్యం ఉత్పత్తి డిస్టిల్లరీలు అన్నీ గత గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినవేనని ఈ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క డిస్టిల్లరీనీ కూడా ఏర్పాటు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఏపి డిస్టిల్లరీ రూల్స్ 2006 మద్యం తయారీకి అనేక ప్రమాణాలు  నిర్ణయించడం జరిగిందని, దాని ప్రకారమే మద్యం తయారవుతోందని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం రాష్ట్రంలోకి రవాణా చేయకుండా రాష్ట్ర సరిహద్దు చెక్కు పోస్టుల్లో సిసి కెమెరాల నిఘాను ఏర్పాటు చేశామని నారాయణ స్వామి చెప్పారు.

నారాయణ స్వామి మీడియా సమావేశంలో వెల్లడించిన ముఖ్యాంశాలు:

  • గత ప్రభుత్వ హయాంలో 4380 మద్యం దుకాణాలుంటే వాటిని 2934కి తగ్గించాం
  • 43వేల బెల్టు షాపులను, 4380 పర్మిట్ రూమ్ లను రద్దు చేశాం
  • గతంలో మద్యం షాపుల సమయాలు ఉ.10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకు ఉండగా ప్రస్తుతం ఆ సమయాన్ని ఉ.11 నుండి రాత్రి 8 గంటల వరకూ పరిమితం చేశాం
  • 2018-19లో 661 లక్షల మద్యం బాక్సులు విక్రయిస్తే 2021లో 224 లక్షల బాక్సులు వినియోగం
  • దశల వారీ మద్య నియంత్రణ చర్యలతో 63శాతం మద్యం వినియోగం తగ్గింది
  • రాష్ట్రంలో దశల వారీ మద్యపాన నిషేదానికి ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉంది
  • రాష్ట్రంలో మద్య నిషేధ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం
RELATED ARTICLES

Most Popular

న్యూస్