Wednesday, February 26, 2025
Homeసినిమాకె. విశ్వనాథ్ సతీమణి విజయలక్ష్మి కన్నుమూత

కె. విశ్వనాథ్ సతీమణి విజయలక్ష్మి కన్నుమూత

కళాతపస్వి, స్వర్గీయ కె. విశ్వనాథ్  సతీమణి విజయలక్ష్మి కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో మరణించారు. ఆమె వయస్సు 86 సంవత్సరాలు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయలక్ష్మి చికిత్స పొందుతున్నారు. విశ్వనాథ్ పెద్ద కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

విశ్వనాథ్ ఈనెల 2వ తేదీన కన్నుమూసిన సంగతి విదితమే, 24 రోజుల వ్యవధిలోనే  ఆయన భార్య కూడా మరణించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విశ్వనాథ్ మరణించిన రోజు కూడా ఆమె మంచంలోనే ఉన్నారు. హీరో చిరంజీవి కూడా విశ్వనాథ్ కు నివాళులర్పించిన అనంతరం ఇంట్లోకి వెళ్లి ఆమెను ఆ మంచం వద్దే పరామర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్