Saturday, November 23, 2024
HomeTrending Newsకెసిఆర్ పై సిబిఐకి కేఏ పాల్ ఫిర్యాదు

కెసిఆర్ పై సిబిఐకి కేఏ పాల్ ఫిర్యాదు

తొమ్మిది లక్షల కోట్ల అవినీతికి కారకులు కేసీఆర్, ఆయన కుటుంబం అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్  ఆరోపించారు. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అవినీతి చూడలేదన్నారు. ఢిల్లీ లో ఈ రోజు సీబీఐ డైరెక్టర్ ను కలిసిన కెఏ పాల్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై సీబీఐ కి ఫిర్యాదు చేశారు. సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్ కు పిర్యాదు చేసిన కే ఏ పాల్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కెఏ పాల్ రాష్ట్రప్రజలంతా సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాలని కోరుతున్నారని చెప్పారు.

కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలని పాల్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉందని ఆ తర్వాత దాన్ని కేసీఆర్ సర్కార్ నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసిందని వెల్లడించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఎమ్మెల్సీ కవిత లు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణతో పాటూ సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని పాల్ విమర్శించారు. ప్రాజెక్టు అంచనా బడ్జెట్ లక్షా 5 వేల కోట్లు కాగా 35 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, 75 వేల కోట్లు దోచుకున్నారని చెప్పారు.

యాదాద్రి అభివృద్ధిలోనూ అవినీతి జరిగిందని, 2 వేల కోట్ల అంచనాలో 200 కోట్లు ఖర్చు చేసి అంతా దోచుకున్నారని కెఏ పాల్ ఆరోపించారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలి. ప్రభుత్వ ఖజానాకు న్యాయం చెయ్యాలి. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల బినామీ లావాదేవీల పై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు నాపై దాడులు చేస్తున్నారని, కేసీఆర్ అవినీతి అక్రమాలపై జరిగే దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. సిబిఐతో పాటూ కేంద్రమంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాలా కు పిర్యాదు కాపీలను పంపిన కెఏ పాల్.

Also Read :

వస్తున్నాడడిగో!

RELATED ARTICLES

Most Popular

న్యూస్