Wednesday, March 18, 2026
Homeసినిమా‘సీతారామం’ నుండి ‘కానున్న కళ్యాణం’ పాట విడుద‌ల‌

‘సీతారామం’ నుండి ‘కానున్న కళ్యాణం’ పాట విడుద‌ల‌

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సీతా రామం’. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని థర్డ్ సింగల్ ‘కానున్న కళ్యాణం’ పాటని హైదరాబాద్ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో జరిగిన ఈవెంట్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, తరుణ్ భాస్కర్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ పాటకు వేదికపై దుల్కర్ సల్మాన్. మృణాల్ ఠాకూర్ డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని అలరించింది.

ఈ పాట మెస్మరైజింగ్ క్లాస్ నంబర్ గా విన్న వింటనే ఆకట్టుకుంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ పాట మనసుని హత్తుకుంది. అనురాగ్ కులకర్ణి, సిందూరి ఈ పాటని ఆలపించిన విధానం అద్భుతంగా వుంది. లెజండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాటకు అందించిన సాహిత్యం పదికాలాలు గుర్తుపెట్టుకునేలా వుంది. పాట పల్లవిలో వినిపించిన ఈ సాహిత్యం మనసుకి గొప్ప హాయిని నింపేలా అనిపించాయి. అద్భుతమైన లోకేషన్స్ చిత్రీకరించిన ఈ పాట చాలా ఆహ్లాదకరంగా వుంది.

ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కీలక పాత్రలో సర్ప్రైజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా హీరో సుమంత్ కీలక పాత్ర పోషిస్తుండగా, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై అందరినీ ఆకట్టుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : అంచ‌నాలు పెంచేసిన ‘సీతారామం’ టీజర్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular