Monday, May 20, 2024
Homeసినిమాఅంచ‌నాలు పెంచేసిన ‘సీతారామం’ టీజర్

అంచ‌నాలు పెంచేసిన ‘సీతారామం’ టీజర్

Sitaramam: స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకం పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.

నిమిషం 14 సెకన్ల నిడివిగల ‘సీతా రామం’ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. టీజర్ తొలి సన్నివేశం 1965 కశ్మీర్ మంచు కొండలని చూపిస్తూ .. ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం వాయిస్ తో మొదలైన టీజర్ విజువల్ వండర్ గా నిలిచింది. ”లెఫ్టినెంట్‌ రామ్‌. నిన్ననే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్‌ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడటానికి ఒక కుటుంబం. కనీసం ఉత్తరం రాయడానికి పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది’ ఈ వాయిస్ ని ఫాలో అవుతూ చూపించిన విజువల్స్, ఎమోషన్స్ మ్యాజికల్ గా వున్నాయి.

లెఫ్టినెంట్‌ రామ్‌ గా దుల్కర్ సల్మాన్ మెస్మరైజ్ చేశారు. తన గత సినిమాల కంటే ఇందులో మరింత హ్యాండసమ్ గా కనిపిస్తున్నారు దుల్కర్ సల్మాన్. తనకు వచ్చిన ఉత్తరాలను చూసి ‘సీతా.. ఎవరు నువ్వు?’ అని దుల్కర్ అన్నవెంటనే నిండు సంప్రాదాయంగా సీత పాత్ర రివిల్ కావడం హను రాఘవపూడి లవ్లీ మార్క్ గా నిలిచింది. దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ ల కెమిస్ట్రీ మ్యాజికల్ గా వుంది.

టీజర్ లో ప్రతి ఫ్రేమ్ లావిష్ గా వుంది. సినిమా విజువల్ వండర్ గా వుండబోతుందని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. పీఎస్ వినోద్ కశ్మీర్ ని మరింత ఆహ్లాదంగా తన కెమరాతో బంధించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం హార్ట్ టచింగ్ గా వుంది. ప్రొడక్షన్ విలువలు అత్యున్నతంగా వున్నాయి. వండర్ ఫుల్ ఫెర్ఫార్మెన్స్, ఆకట్టుకునే కథనం, అందమైన విజువల్స్, మ్యాజికల్ మ్యూజిక్ తో’ సీతా రామం’ ఒక ఎపిక్ లవ్ స్టోరీగా ఉండబోతోందని టీజర్ భరోసా ఇస్తుంది. ”సీతా రామం” తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతుంది. ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ టీజ‌ర్ సినిమా పై ఉన్న అంచ‌నాల‌ను పెంచేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్