Saturday, January 18, 2025
Homeసినిమాఅంతా అయిన తరువాత  కాజల్ లేదంటారేంటండీ!

అంతా అయిన తరువాత  కాజల్ లేదంటారేంటండీ!

Acharya- Kajal: చిరంజీవి – చరణ్ కథానాయకులుగా ‘ఆచార్య’ సినిమా రూపొందింది. ఈ ఇద్దరూ కూడా ఈ సినిమాలో నక్సలైట్లుగా కనిపించనున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చరణ్ జోడీగా పూజ హెగ్డే అలరించనుంది. చిరంజీవి సరసన నాయికగా ముందుగా నయనతారను అనుకున్నారు .. ఆ తరువాత  త్రిషను సంప్రదించారు. పారితోషికం పరంగా వాళ్లిద్దరూ వర్కౌట్  కాకపోవడంతో కాజల్ ను తీసుకున్నారు. ఆమె లుక్  కూడా బయటికి వచ్చింది. కాజల్ మరింత గ్లామరస్ గా ఉందని అంతా అనుకున్నారు.

ఆ తరువాత కాజల్ ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె పాత్రను కుదించినట్టుగా చెప్పుకున్నారు. ఇంతవరకూ చిరూ – కాజల్ కాంబినేషన్లోని ఫొటోలు బయటికి రాలేదు. రీసెంట్ గా వదిలిన ట్రైలర్ లోను కాజల్ కనిపించలేదు. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను ఎవరూ కాజల్ గురించిన ప్రస్తావన చేయలేదు. సాధారణంగా ఏ కారణంగానైనా హీరోయిన్ రాకపోతే ఆమె రాలేకపోయిందని చెబుతూ, ఆమె కూడా చాలా గొప్పగా చేసిందని చెబుతుంటారు. కానీ ‘ఆచార్య’ వేదికపై ఆమె ఊసే లేదు. అప్పుడే అందరికీ డౌటు వచ్చింది .. ఈ సినిమాలో కాజల్ ఉందా .. లేదా అని!

తాజాగా కొరటాల మాట్లాడుతూ .. ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా కాజల్ ను తీసుకోవడం జరిగింది. కానీ  ఫస్టు  షెడ్యూల్ పూర్తయిన తరువాత చూస్తే, ఆమె పాత్రకి అంతగా ప్రాధాన్యత లేదని అనిపించింది. పైగా ఆ పాత్ర కథకి  అడ్డుపడుతుందని అనిపించింది. అందువలన ఈ సినిమా నుంచి కాజల్ పాత్రను తొలగించడం జరిగింది. ఈ విషయం చెప్పగానే నవ్వుతూనే కాజల్ అర్థం చేసుకుంది” అని కొరటాల అన్నారు. ఫస్టు షెడ్యూల్ తరువాత కాజల్ పక్కకి తప్పుకుంటే, అంతా అయిన తరువాత ఇప్పుడా చెప్పడం? అంటూ అభిమానులు అసహనానికి లోనవుతున్నారు.

Also Read : ప‌వ‌న్, చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో భారీ మ‌ల్టీస్టార‌ర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్