Tuesday, April 16, 2024
Homeసినిమాప‌వ‌న్, చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో భారీ మ‌ల్టీస్టార‌ర్

ప‌వ‌న్, చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో భారీ మ‌ల్టీస్టార‌ర్

Mega Cambo: మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం ఆచార్య. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో ఆచార్య సినిమా పై ఆకాశ‌మే హ‌ద్దు అనేలా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఈ నెల 29న భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది.

ఇదిలా ఉంటే.. బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో అబ్బాయ్ రామ్ చ‌ర‌ణ్ ఓ భారీ చిత్రం చేయ‌నున్నార‌ని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ క్రేజీ కాంబినేష‌న్లో మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ బ‌య‌ట‌కు రాలేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఇప్పటికే సినిమా గురించి ఆల్రేడీ చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని తెలిపారు. అంతేకాకుండా మేము ఈ సినిమాని ఖ‌చ్చితంగా చేస్తామ‌ని.. అంచ‌నాల‌కు మించి ఈ సినిమా ఉంటుంద‌ని చెప్పారు.

బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో చేసే సినిమాను త‌నే నిర్మిస్తాన‌ని కూడా తెలియ‌చేశారు. అయితే.. ఈ సినిమా ఎప్పుడు ఉంటుంద‌ని మాత్రం చెప్ప‌లేదు. తండ్రి చిరుతో ఆచార్య సినిమా చేసిన చ‌ర‌ణ్‌.. బాబాయ్ ప‌వ‌న్ తో కూడా సినిమా చేయ‌బోతుండ‌డం విశేషం. అయితే.. బాబాయ్, అబ్బాయ్ క‌లిసి ఏ త‌ర‌హా చిత్రం చేయ‌నున్నారో..?  ద‌ర్శ‌కుడు ఎవ‌రో..? ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్