Saturday, January 18, 2025
Homeసినిమాకొత్త రికార్డులను క్రియేట్ చేయనున్న 'కల్కి' 

కొత్త రికార్డులను క్రియేట్ చేయనున్న ‘కల్కి’ 

ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి’ .. రేపు థియేటర్లలో దిగిపోనుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో అత్యధిక బడ్జెట్ తో నిర్మితమైన పాన్ ఇండియా సినిమా ఇది. ఈ ప్రాజెక్టును ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి అందరిలో ఉత్కంఠను పెంచుతూనే ఉంది. పోస్టర్ల నుంచి ట్రైలర్ వరకూ ఆసక్తిని పెంచుతూనే వెళ్లాయి. ప్రభాస్ లుక్ కూడా ఈ స్థాయి కుతూహలం పెరగడానికి కారణమవుతోంది.

అటు పురాణాలను .. ఇటు సైన్స్ ఫిక్షన్ ను జోడిస్తూ తయారు చేసుకున్న ఈ కథ, పాత్రల పరంగా అందరిలో ఒక ఆలోచనను రేకెత్తిస్తూ వచ్చింది. ఇప్పుడది అడ్వాన్స్ బుకింగ్స్ పై ప్రభావం చూపుతూనే ఉంది. దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు ఒక రేంజ్ లో కొనసాగుతోంది. మొదటి రోజునే ఈ సినిమా 200 కోట్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. వీకెండ్ నాటికి 500 కోట్ల మార్క్ ను టచ్ చేయడం ఖాయమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాలో అమితాబ్ .. కమల్ వంటి సీనియర్ స్టార్స్ నటించిన సంగతి తెలిసిందే. ప్రధానమైన పాత్రలను పోషించిన కొంతమంది ఆర్టిస్టులను మాత్రమే పరిచయం చేశారు. క్రేజ్ ఉన్న మరికొంతమంది ఆర్టిస్టులు ఈ సినిమాలో ఉన్నారట. అయితే వారిని ఇంతవరకూ రివీల్ చేయలేదు. ప్రేక్షకులు నేరుగా తెరపై చూసి థ్రిల్ పొందడం కోసం గోప్యంగా ఉంచారని అంటున్నారు. మరి అలా మెరిసే ఆ స్టార్స్ ఎవరనేది తెలియాలంటే, రేపటివరకూ వెయిట్ చేయవలసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్