కళ్యాణ్ కృష్ణను సస్పెన్స్ లో పెట్టేసిన మెగాస్టార్?

ముందుగా చెప్పినట్లే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున రెండు కొత్త సినిమాలు అనౌన్స్ చేశారు. బింబిసార్ డైరెక్టర్ వశిష్ట్ తో యు.వీ. క్రియేషన్స్ బ్యానర్ పై  చిరంజీవి ఓ సినిమా చేస్తున్నారు, దీనికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇది సోషియో ఫాంటసీ మూవీ. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తర్వాత  చిరు ఈ తరహా సినిమా చేస్తున్నారు.

అయితే.. వశిష్ట్ తో పాటు కళ్యాణ్ కృష్ణతో కూడా చిరు సినిమా చేస్తున్నారు. దీన్ని మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారని వార్తలు వచ్చాయి, ఈ సినిమాని మొన్న  ప్రకటించారు కానీ.. డైరెక్టర్ ఎవరనేది  మాత్రం అనౌన్స్ చేయలేదు. కళ్యాణ్ కృష్ణను సస్పెన్స్ లో పెట్టడం ఆసక్తిగా మారింది. ఈ సినిమా బ్రో డాడీకి రీమేక్ అని, కాదు.. సొంత కథ అని పలు రకాలుగా ప్రచారం జరుగుతోంది.  బెజవాడ ప్రసన్న ఈ కథను అందించారని కూడా టాక్ వచ్చింది.

డైరెక్టర్ పేరు ప్రకటించకపోవడంతో ఇది రీమేక్  కాబట్టి ఈ సినిమా చేయాలా..? వద్దా..? అనేది చిరు  తేల్చుకోలేకపోతున్నారట. సుస్మిత బ్యానర్ లో 156వ సినిమా చేసిన తర్వాతే వశిష్ట్ తో 157వ సినిమా చేయనున్నట్టుగా కన్ ఫర్మ్ చేశారు. దీంతో కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకుంటారా..? లేక.. వేరే డైరెక్టర్ ఆ ఛాన్స్ సొంతం చేసుకుంటారా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. చిరు 156 దర్శకుడు ఎవరో క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *