Friday, April 19, 2024
Homeసినిమాబింబిసార 2, డెవిల్ అప్ డేట్స్....

బింబిసార 2, డెవిల్ అప్ డేట్స్….

ఓ వైపు హీరోగా సక్సెస్ సాధిస్తూ మరో వైపు నిర్మాతగానూ రాణిస్తున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్. కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ మూవీస్ చేస్తున్న కళ్యాణ్ రామ్ ఇటీవల బింబిసార మూవీ చేశారు. ఇందులో హీరోగానూ, విలన్ గానూ నటించడం విశేషం. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు అమిగోస్ అనే మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేయడం విశేషం.

అంతే కాకుండా.. మనిషిని పోలిన మనుషులు ఉంటారనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందడం మరో విశేషం. నూతన దర్శకుడు రాజేంద్రరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ నెక్ట్స్ మూవీస్ గురించి అప్ డేట్ ఇచ్చారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. నవీన్ మేడారం డైరెక్షన్ లో డెవిల్ అనే చిత్రం  చేస్తున్నానని, ఈ సినిమా దాదాపు 70 శాతం కంప్లీట్ అయ్యిందని చెప్పారు. త్వరలోనే మిగిలిన ముప్పై శాతం షూటింగ్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకున్నాయి.

చారిత్రక నేపథ్యంలో సాగే ఈ కథకి ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉపశీర్షిక. 1945 నాటి కాలానికి సంబంధించిన కొన్ని పరిణామాల్ని ఈ చిత్రంలో చూపించనున్నామని చెప్పారు. ఇక బింబిసార 2 గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. త్వరలోనే దర్శకుడు వశిష్ట తాను కలిసి సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకెళ్తామని చెప్పారు. దాదాపుగా ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు. కళ్యాణ్ రామ్ లైనప్ బాగుంది. మరి.. ఈ సినిమాలతో కూడా వరుసగా సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్