Saturday, July 27, 2024
Homeసినిమా'అమిగోస్' పై ఎన్టీఆర్ స్పందన ఏంటో?

‘అమిగోస్’ పై ఎన్టీఆర్ స్పందన ఏంటో?

‘బింబిసార’ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన నందమూరి కళ్యాణ్‌ రామ్ తాజాగా నటిస్తోన్న చిత్రం ‘అమిగోస్‘. ఈ సినిమా ద్వారా రాజేంద్రరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేయడం మరో విశేషం.

అయితే.. బింబిసార మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ… ఈ పాత్రను కళ్యాణ్ రామ్ తప్పితే ఇంకొకరు చేయలేరని, అద్భుతంగా నటించారని, ఖచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారు. ఎన్టీఆర్ చెప్పినట్టుగానే బింబిసార మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు అమిగోస్ మూవీ వచ్చింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు కూడా గెస్ట్ గా ఎన్టీఆర్ వచ్చారు. ఇప్పటి వరకు రాని కాన్సెప్ట్ తో రాజేంద్రరెడ్డి ఈ సినిమా తీశాడని చెప్పారు. అలాగే డైరెక్టర్ అయ్యే వరకు ఇంటికి వెళ్లనని చెప్పారని తెలిసి.. సినిమాని ఇంతగా ప్రేమించేవాళ్లు ఉంటారా అనిపించిందని ఎన్టీఆర్ చెప్పారు.

అంత బాగానే ఉంది కానీ.. అమిగోస్ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని గట్టిగా చెప్పలేదు. బింబిసారకు చెప్పినంత నమ్మకంగా చెప్పలేదు. కళ్యాణ్ రామ్ కూడా కొత్త పాయింట్ తో సినిమా చేశామని చెబుతున్నారు కానీ.. ఇది ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పడం లేదు. అంతే కాకుండా.. ఇటీవల మీడియా ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ ని ఎన్టీఆర్ ఈ సినిమా చూసి ఏమన్నారని అడిగితే.. నాకు తెలుసు ఈ ప్రశ్న అడుగుతారని.. నేను చెప్పను అని సమాధానం ఇచ్చారు. దీంతో కళ్యాణ్‌ రామ్ ఎందుకు ఇలా చెప్పారు.. ఏదో తేడా కొడుతుంది అని వార్తలు వచ్చాయి. అయితే.. ఈ చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ .. ఎన్టీఆర్ గారు ఈ సినిమాను చూశారు .. పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. బింబిసార చూసిన తర్వాత ఆయన చెప్పిన మాటనే నిజమైంది. అలాగే ఈ సినిమా కూడా ఆయన చెప్పినట్టుగానే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది అన్నారు. మరి.. నిజంగానే ఎన్టీఆర్ అలా చెప్పారా..? ఇదే నిజమైతే.. కళ్యాణ్ రామ్ ఎందుకలా మాట్లాడారు..? అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్