Saturday, January 18, 2025
Homeసినిమాఆ వార్తలు నిజం కాదు: కళ్యాణ్ రామ్

ఆ వార్తలు నిజం కాదు: కళ్యాణ్ రామ్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల గురించి రోజుకో వార్త బయటకు వస్తుండడంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి అనిపిస్తుంది. ప్రకాష్‌ రాజ్, మంచు విష్ణు ఈ ఇద్దరి మధ్య పోటీ అనుకుంటే.. జీవిత ఎంట్రీ ఇచ్చారు. త్రిముఖ పోటీ అనుకుంటే.. నేనున్నాను అంటూ హేమ రంగంలోకి దిగడంతో చతుర్మఖపోటీగా మారింది. నిన్న తన ప్యానల్ సభ్యులను ప్రకటించిన ప్రకాష్ రాజ్ నేడు మీడియా ముందుకు రాబోతున్నారు.

ఇదిలా ఉంటే.. నందమూరి ఫ్యామిలీ నుంచి కళ్యాణ్‌ రామ్‌ కూడా ఈసారి మా అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో మా ఫైట్‌ మరింత రంజుగా మారబోతుందని అంటూ ప్రచారం ఊపందుకుంది. ప్రచారంలో ఉన్న వార్తల పై నందమూరి కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే.. ‘మా ఎన్నికల్లో కళ్యాణ్ రామ్ పోటీ చేస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు’ అని అయన పీఆర్‌ యూనిట్‌ ప్రకటించింది. దయచేసి ఎవరూ ఆ వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్