Saturday, January 18, 2025
Homeసినిమాబింబిసార 2 లో ఎన్టీఆర్? క్లారిటీ ఇచ్చిన క‌ళ్యాణ్ రామ్

బింబిసార 2 లో ఎన్టీఆర్? క్లారిటీ ఇచ్చిన క‌ళ్యాణ్ రామ్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన లేటెస్ట్ మూవీ బింబిసార‌. ఈ చిత్రం ద్వారా వ‌శిష్ట్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన‌ప్ప‌టి నుంచి బింబిసార మూవీ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. నంద‌మూరి అభిమానులు ఎప్పుడెప్పుడు బింబిసార వ‌స్తుందా అని ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. బింబిసార ప్ర‌మోష‌న్స్ లో భాగంగా క‌ళ్యాణ్ రామ్ ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో బింబిసార 2 ఉంటుంద‌ని చెప్పారు. అప్ప‌టి నుంచి బింబిసార 2 లో ఎన్టీఆర్ అంటూ వార్త‌లు వ‌చ్చాయి. దీంతో బింబిసార 2 లో నంద‌మూరి సోద‌రులు క‌లిసి న‌టించ‌నున్నారు అంటూ ప్ర‌చారం ఊపందుకుంది. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై క‌ళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు.

ఇంత‌కీ క‌ళ్యాణ్ రామ్ ఏం చెప్పారంటే… “బింబిసార క‌థ‌ను రెండు భాగాలుగా చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నాం. అయితే.. బింబిసార 2 లో ఎన్టీఆర్ న‌టిస్తున్నాడనే వార్త‌ల్లో ఏమాత్రం వాస్త‌వం లేదు” అన్నారు. పార్ట్ 2 మ‌రింత అద్భుతంగా రూపొందిస్తామ‌న్నారు. అలాగే ఈ చిత్రానికి మ‌రిన్ని సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నామ‌ని కూడా తెలియ‌చేశారు. ఎప్ప‌టి నుంచో సోషియో షాంట‌సీ మూవీ చేయాల‌నేది క‌ల‌. ఆ క‌ల డైరెక్ట‌ర్ వ‌శిష్ట్ ద్వారా నెర‌వేరింద‌న్నారు. ఆగ‌ష్టు 5న బింబిసార రిలీజ్ అవుతుంది. మ‌రి.. బింబిసార ఎంత వ‌ర‌కు మెప్పిస్తుందో చూడాలి.

Also Read బింబిసార చూసి ఎన్టీఆర్ ఏమ‌న్నారో తెలుసా..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్