Friday, March 29, 2024
Homeసినిమాబింబిసార చూసి ఎన్టీఆర్ ఏమ‌న్నారో తెలుసా..?

బింబిసార చూసి ఎన్టీఆర్ ఏమ‌న్నారో తెలుసా..?

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తూ.. నిర్మించిన భారీ సోసియో ఫాంట‌సీ మూవీ బింబిసార‌. ఈ మూవీకి నూత‌న ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్  ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న సంయుక్త మీన‌న్, కేధ‌రిన్ న‌టించారు. ఇటీవ‌ల ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో ఈ ట్రైల‌ర్ ఇంకా దూసుకెళుతుంది. ఆగ‌ష్టు 5న బింబిసార మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవ‌ల ఈ మూవీ నుండి ఈశ్వరుడే అనే పల్లవితో సాగే ఎమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు కూడా విశేషాద‌ర‌ణ ల‌భించింది. క‌ళ్యాణ్ రామ్ ఎప్ప‌టి నుంచో భారీ విజ‌యం సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ సినిమాతో క‌ళ్యాణ్ రామ్ ఆశించిన స‌క్సెస్ వ‌స్తుంద‌ని టీమ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. ఇదిలా ఉంటే.. క‌ళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ కోసం బింబిసార చిత్రాన్ని ప్ర‌త్యేకంగా షో వేసి చూపించార‌ట‌.

బింబిసార సినిమాని చూసిన ఎన్టీఆర్ .. అన్న నందమూరి కళ్యాణ్ రామ్ పై, అలానే మూవీ యూనిట్ పై ప్రశంసలు కురిపించారట. ముఖ్యంగా మూవీలో కళ్యాణ్ రామ్ అద్భుతంగా న‌టించాడ‌న్నార‌ట‌. అలాగే దర్శకుడు వశిష్ట్ మూవీని విజువల్ గ్రాండియర్ గా ప్రతి ఫ్రేమ్ ఆకట్టుకునేలా తీసారని తప్పకుండా మూవీ రిలీజ్ తరువాత పెద్ద విజ‌యం ఖాయం అని అన్నారట ఎన్టీఆర్. మ‌రి.. బింబిసార ఏ స్థాయి విజ‌యం సాధిస్తుందో చూడాలి.

Also Read : ఏజెంట్ టీజర్ పై మ‌హేష్ ఏమ‌న్నారో తెలుసా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్