Friday, March 29, 2024
Homeసినిమాబాబాయ్ సాంగ్ రీమేక్స్ చేసిన కళ్యాణ్ రామ్

బాబాయ్ సాంగ్ రీమేక్స్ చేసిన కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్ కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథా చిత్రాలు చేస్తున్నారు. ‘అతనొక్కడే’, ‘హరేరామ్’, ‘ఓం’, ‘బింబిసార’.. ఇలా డిఫరెంట్ మూవీ చేస్తున్న కళ్యాణ్ రామ్ మరో వైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తను హీరోగా నటించడమే కాకుండా తమ్ముడు తారక్ తో కూడా సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇలా ఓ వైపు హీరోగా చేస్తూనే మరో వైపు నిర్మాతగా రాణిస్తున్నాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూ వస్తున్న కళ్యాణ్‌ రామ్ ఇటీవల కొత్త దర్శకుడు వశిష్ట్ తో బింబిసార అంటూ బ్లాక్ బస్టర్ సాధించాడు.

కళ్యాణ్‌ రామ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘అమిగోస్‘. రీసెంట్ గా బింబిసారతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన కళ్యాణ్‌ రామ్ అదే జోష్ తో చేసిన సినిమా ఇది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ ద్వారా రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో హీరో కళ్యాణ్‌ రామ్ విభిన్నంగా త్రిపాత్రాభినయం చేస్తుండడం విశేషం. గత సినిమాలకు పూర్తి భిన్నమైన కథతో రూపొందుతున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.

అషికా రంగనాథన్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నఈ మూవీని ఫిబ్రవరి 10న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ ని ఇప్పటికే మేకర్స్ ప్రారంభించారు. ఈ మూవీ కోసం 1992లో నందమూరి బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్రం మూవీలోని ఎన్నో రాత్రులొస్తాయి గానీ.. అంటూ సాగే రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటను సెకండ్ సింగిల్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఫ్యాన్స్ తో కళ్యాణ్‌ రామ్ మాట్లాడుతున్న ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ పాట అమిగోస్ మూవీకి హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. మరి.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీతో కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

Also Read : అమిగోస్ తో పరిచయమవుతున్న అందాల రాశి! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్