Monday, May 20, 2024
Homeసినిమాప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' లో కమల్..?

ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’ లో కమల్..?

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. ఈ చిత్రంలో ప్రభాస్ కు జంటగా దీపికా పడుకునే నటిస్తుంటే… కీలక పాత్రలో బిగ్ బి అమితాబ్ నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. దాదాపు 500 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాన్ వరల్డ్ మూవీని సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలోని మరో కీలక పాత్రలో కమల్ హాసన్ నటించనున్నారని ఓ వార్త బయటకు వచ్చింది.

ఈ వార్త వైరల్ అయ్యింది. అయితే.. కమల్ హాసన్ ని ఈ సినిమాలో కీలక పాత్ర చేయమని మేకర్స్ కాంటాక్ట్ చేశారని.. వారి మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. అయితే.. వారి మధ్య చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, రానున్న రోజుల్లో దీని పై క్లారిటీ రానుంది. కాగా ఈ మూవీ మేకర్స్ 20 రోజుల కమల్ కాల్షీట్ల కోసం భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని ఉన్నారని కూడా టాక్ వినిపిస్తుంది. ఒకవేళ కమల్ హాసన్ ఈ ఆఫర్‌ను అంగీకరించాలని నిర్ణయించుకుంటే.. ప్రాజెక్ట్ కే మూవీ పై మరింత క్రేజ్ రావడం ఖాయం.

ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి ఓ గైడ్ లా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ తెర పై రాని కథతో ఈ సినమా ఉంటుందని తెలియడంతో అభిమానుల్లోనే కాదు ఇండస్ట్రీలోనూ ప్రాజెక్ట్ పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతికి రావడం ఖాయమని ప్రకటించడంతో ఈసారి సంక్రాంతి తమదే అని ప్రభాస్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్