Thursday, March 28, 2024
Homeసినిమావిక్ర‌మ్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన క‌మ‌ల్

విక్ర‌మ్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన క‌మ‌ల్

Vikram Sequel: యూనివ‌ర్శిల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన తాజా చిత్రం విక్ర‌మ్. ఈ చిత్రానికి లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో విజ‌య్ సేతుప‌తి, ఫాహిద్ ఫాజిల్ కీల‌క పాత్ర‌లు పోషించారు. క‌మ‌ల్, విజ‌య్ సేతుప‌తి, ఫాహిద్ ఫాజిల్.. అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. ఇదంతా ఓ ఎత్తైతే.. చివ‌రిలో సూర్య గెస్ట్ రోల్ ఓ ఎత్తు. సూర్య తెర పై క‌న‌ప‌డ‌గానే.. థియేట‌ర్లు దద్ద‌రిల్లిపోయాయి. అయితే.. సూర్య క్యారెక్ట‌ర్ తో సీక్వెల్ కి హింట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్.

దీంతో విక్ర‌మ్ సీక్వెల్ ఉంటుందా..? ఎప్పుడు ఉంటుంది..? అనేది ఆస‌క్తిగా మారింది. సీక్వెల్ తీయాల‌ని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. విక్ర‌మ్ సీక్వెల్ పై క‌మ‌ల్ క్లారిటీ ఇచ్చారు. ఇంత‌కీ క‌మల్ ఏమ‌న్నారంటే… తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ మంచి సినిమాల‌ను ఆద‌రిస్తారు. అలాగే మంచి ఆర్టిస్ట్ ని ఆద‌రించి స‌పోర్ట్ గా నిలుస్తారు. ఇప్పుడు విక్ర‌మ్ చిత్రాన్ని ఆద‌రించ‌డం.. ఈ సినిమా చేసుకున్న భాగ్యం. అలాగే పెద్ద హిట్ ఇచ్చి న‌న్ను ఆద‌రించ‌డం నా అదృష్టం అన్నారు.

అంతే కాకుండా.. నా మీద అభిమానంతో సూర్య న‌టించాడు. అత‌ని మూడు నిమిషాల గెస్ట్ రోల్ థియేట‌ర్స్ ద‌ద్ద‌రిల్లిపోయేలా చేసింది. అందుకు కృత‌జ్ఞ‌త‌గా మేమిద్ద‌రం క‌లిసి న‌టించ‌బోయే త‌ర్వాత చిత్రంలో చూపిస్తాను అంటూ విక్ర‌మ్ సీక్వెల్ ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు క‌మ‌ల్. ఇలా క‌మ‌ల్ స్పందించిన‌ప్ప‌టి నుంచి విక్ర‌మ్ సీక్వెల్ పై మ‌రెంత ఆస‌క్తి ఏర్ప‌డింది. ఇది అభిమానుల‌కు పండ‌గ లాంటి వార్త అని చెప్ప‌చ్చు.

Also Read : ఈ గెలుపు  ఒంటరిగా సాధించింది కాదు: కమల్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్