Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్రెండో టెస్టుకు కేన్ విలియమ్సన్ దూరం!

రెండో టెస్టుకు కేన్ విలియమ్సన్ దూరం!

ఇంగ్లాండ్ తో జరిగే రెండో టెస్టుకు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. కేన్స్ స్థానంలో టామ్ లాథమ్ జట్టుకు సారధ్యం వహించనున్నాడు. ఇంగ్లాండ్ తో న్యూజిలాండ్ రెండు టెస్టుల సీరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. లార్డ్స్ మైదానంలో జూన్ 2 నుంచి 6వ తేదీ వరకు జరిగిన మొదటి టెస్ట్ డ్రా గా ముగిసింది. రెండవ, ఆఖరి టెస్ట్ జూన్ 10న ఎడ్జ్ బాస్టన్ లో మొదలుకానుంది. ఎడమ మోచేతి గాయం కారణంగా కేన్స్ ఈ టెస్టుకు దూరమయ్యాడు. అయితే జూన్ 18 నుంచి ఇండియాతో ఆడే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ నాటికి కేన్స్ అందుబాటులోకి రానున్నాడు. కేన్స్ స్థానంలో ఇంగ్లాండ్ తో రెండో టెస్టుకు విలియమ్స్ యంగ్ జట్టులో చేరనున్నాడు

ఈ గాయం కొద్దిరోజులుగా కేన్స్ ను ఇబ్బంది పెడుతోందని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టేడ్ వెల్లడించాడు. ఇది అసాధారణ నిర్ణయమే అయినా తప్పలేదన్నాడు.సౌతాంప్టన్ లో జరగబోయే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. జూన్ 16 నాటికి కేన్స్ తప్పకుండా అందుబాటులో ఉండాడని గ్యారీ విశ్వాసం వ్యక్తం చేశాడు. మోచేతి గాయం నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు కేన్స్ ఇంజెక్షన్ తీసుకున్నాడని, స్వల్ప విశ్రాంతితో కేన్స్ విలియమ్సన్ రెట్టించిన ఉత్సాహం పొందుతాడని గ్యారీ వెల్లడించాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్