7.8 C
New York
Saturday, December 2, 2023

Buy now

HomeసినిమాKangana Ranaut: మహేష్ తో మిస్ అయ్యింది.. చరణ్ తో చేయాలనివుంది - కంగనా

Kangana Ranaut: మహేష్ తో మిస్ అయ్యింది.. చరణ్ తో చేయాలనివుంది – కంగనా

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.. చంద్రముఖి 2 సినిమాతో ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ కలయికలోకోలీవుడ్ డైరెక్టర్ పి.వాసు ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించారు. పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో చంద్రముఖి 2 చిత్రం రిలీజ్ అవుతుండడంతో ఈ క్రేజీ మూవీ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన కంగనా రనౌత్ పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకుంది.

ఇంతకీ ఏం చెప్పిందటంటే.. తను నటి కాకముందే స్టార్ అవుతానని గుర్తించింది పూరి జగన్నాథ్ అని.. పోకిరి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అనుకున్నారు. అయితే.. అదే సమయంలో బాలీవుడ్ మూవీ గ్యాంగ్ స్టర్ లో నటించే అవకాశం వచ్చింది. పోకిరి, గ్యాంగ్ స్టర్ ఈ రెండు సినిమాల షూటింగ్ ఓకే టైమ్ లో కావడంతో.. బాలీవుడ్ మూవీకి ఓకే చెప్పాను. ఆతర్వాత పూరి జగన్నాథ్ ఏక్ నిరంజన్ మూవీతో టాలీవుడ్ కి పరిచయం చేశారు. ఈ సినిమాతో ప్రభాస్ మంచి ఫ్రెండ్ అయ్యాడు. అయితే.. మహేష్ తో పోకిరి సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ బాధగా ఉందని కంగనా చెప్పింది.

టాలీవుడ్ లో రామ్ చరణ్ తో కలిసి నటించాలని వుందని.. అలాగే రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయాలని వుందని మనసులో మాటను బయటపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి.. కంగనా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

Also Read: చంద్రముఖి మ్యాజిక్ ని చంద్రముఖి 2 రిపీట్ చేసేనా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్