Saturday, January 18, 2025
Homeసినిమానయనతార ప్లేస్ లో కనిపించనున్న కంగనా! 

నయనతార ప్లేస్ లో కనిపించనున్న కంగనా! 

మంచు విష్ణు కథానాయకుడిగా ‘కన్నప్ప’ సినిమా రూపొందుతోంది. ఆయన సొంత బ్యానర్లో .. 100 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది అడవీ ప్రాంతంలోని ఓ గిరిజన గూడెంలో జరిగే కథనే అయినప్పటికీ, ఈ ట్రెండ్ కి తగినట్టుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను తీర్చిదిద్దు తున్నారు. హాలీవుడ్ సినిమాలకి పనిచేసిన సాంకేతిక బృందం ఈ సినిమాకి పనిచేస్తోంది. ఫారెస్టు నేపథ్యంలోని సన్నివేశాలను న్యూజిలాండ్ లో చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ మహాశివుడిగా కనిపించనున్నాడు. ఈ అంశం ఈ సినిమాకి అదనపు బలంగా మారనుంది. ఇక పార్వతీదేవిగా ఎవరు నటించనున్నారనే సందేహానికి సమాధానంగా నయనతార పేరు వినిపించింది. గతంలో ఈ జోడీకి మంచి మార్కులు పడటంతో, ఆడియన్స్ మరింత ఆసక్తికి లోనయ్యారు. అయితే ఇప్పుడు నయనతార ప్లేస్ లో కంగనా రనౌత్ పేరు తెరపైకి వచ్చింది. పార్వతీదేవిగా కనిపించనుండటం దాదాపు ఖరారైపోయిందని అంటున్నారు.

కంగనా రనౌత్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ‘కన్నప్ప’ పాన్ ఇండియా సినిమా కావడం వలన ఆమె ఎంపిక సరైనదేనని అనుకోవచ్చు. అయితే గతంలో ఆమె కూడా తెలుగులో ప్రభాస్ జోడీగా సందడి చేసినదే. మోహన్ బాబు .. శివరాజ్ కుమార్ .. శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ఆలోచనలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్