Saturday, July 27, 2024
Homeసినిమామెగాస్టార్ సరసన మెరవనున్న ఆషిక రంగనాథ్!

మెగాస్టార్ సరసన మెరవనున్న ఆషిక రంగనాథ్!

ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో ఆషిక రంగనాథ్ ఒకరు. ‘అమిగోస్’ సినిమాతో టాలీవుడ్ కి ఈ బ్యూటీ పరిచయమైంది. ఆ సినిమా అంతగా ఆడకపోయినా, గ్లామర్ పరంగా ఆమెకి మంచి మార్కులు పడిపోయాయి. ఆ సినిమా తెచ్చిన క్రేజ్ కారణంగానే ఆమెకి ‘నా సామిరంగ’లో ఛాన్స్ దక్కింది. ఈ సినిమాలో ఆమె మరింత బ్యూటిఫుల్ గా కనిపించింది. రొమాంటిక్ సాంగ్స్ లోను అందంగా మెరిసింది. ఈ సినిమా సక్సెస్ కి గల కారణాలలో ఆమె గ్లామర్ కూడా ఒకటనే చెప్పాలి.

చక్కని కనుముక్కుతీరు .. నాజూకుతనంతో ఆమె యూత్ ఆడియన్స్ ను కూడా తన అభిమానులుగా మార్చేసింది. ఈ కారణంగానేనేమో ఇప్పుడు ఆమె చిరంజీవి సినిమాలో అవకాశం దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. చిరంజీవి కథానాయకుడిగా శ్రీవశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ రూపొందుతోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ సినిమాను, అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భారీ సెట్లు .. వీఎఫ్ ఎక్స్ హడావిడి ఒక రేంజ్ లోనే కనిపించనుంది.

అలాంటి ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు కనిపించనున్నారనే టాక్ వచ్చింది. అందుకు తగినట్టుగానే ఒక కథానాయికగా ‘త్రిష’ ను ఎంపిక చేశారు. ఆ తరువాత మరో కథానాయికగా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. తాజాగా ఆషిక రంగనాథ్ ను కూడా తీసుకున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ‘నా సామిరంగ’ తరువాత ఈ సుందరి సీనియర్ హీరోల జోడీగా బాగా నప్పుతుందనే టాక్ వచ్చింది. త్వరలో మిగతా సీనియర్ స్టార్స్ సరసన ఆమె సందడి చేసే ఛాన్స్ ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్