1st Test Draw
ఇండియా- న్యూజిలాండ్ మధ్య కాన్పూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ డ్రా గా ముగిసింది. నిన్న ఒక వికెట్ నష్టానికి నాలుగు పరుగులతో నేటి ఆట మొదలుపెట్టిన కివీస్ బ్యాట్స్ మెన్ ‘డ్రా’ లక్ష్యంతోనే నెమ్మదిగా ఆడారు. నేడు చివరి రోజు 280 పరుగులు చేయాల్సి ఉండగా ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. నేడు మొత్తం 98 వర్లపాటు ఆట సాగింది. లంచ్ సమయానికి ఒక వికెట్ కు 79 పరుగులు చేసిన కివీస్, టీ సమయానికి మరో మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో డ్రా తప్పదని అందరూ భావించారు. కానీ టీ విరామం తరువాత భారత బౌలర్లు చెలరేగదాంతో కివీస్ వెంట వెంట వికెట్లు కోల్పోయింది, 89.2 ఓవర్లలో 155 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ క్రీజులో ఉన్నారు, వీరిద్దరూ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని 8.4 ఒవర్లపాటు వికెట్ కోల్పోకుండా జాగ్రత్తపడి మ్యాచ్ ను డ్రా వైపు నడిపించారు. రచిన్ 18, అజాజ్ 2 పరుగులతోను అజేయంగా నిలిచి ఇండియా గెలుపును అడ్డుకున్నారు.
ఇండియా బౌలర్లలో జడేజా-4, రవిచంద్రన్ అశ్విన్-3, అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
శ్రేయాస్ అయ్యర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.