Saturday, January 18, 2025
Homeసినిమాముగింపు దశకి చేరుకున్న 'కాంతార 2'  

ముగింపు దశకి చేరుకున్న ‘కాంతార 2’  

కన్నడ సినిమా స్థాయిని పెంచిన సినిమాల జాబితాలో ‘కాంతార’ ఒకటిగా కనిపిస్తుంది. గతంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి భారీ బడ్జెట్ సినిమాలు వచ్చాయి. వందల కోట్ల వసూళ్లను తెచ్చాయి. అయితే ‘కాంతార’ పరిస్థితి వేరు. ఈ సినిమా కేవలం 16 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. అప్పటికి రిషభ్ శెట్టికి ఇతర భాషల్లో అంతగా ఫాలోయింగ్ కూడా లేదు. తెలుగులో కూడా అతను పెద్దగా తెలియదు. అలాంటి రిషభ్ శెట్టి చేసిన ఈ సినిమా సంచలనం సృష్టించింది.

కేవలం 16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, దాదాపు 450 కోట్ల వసూళ్ల వరకూ సాధించింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుంటుందని అంతా అనుకున్నారు. అయితే రిషభ్ శెట్టి మాత్రం ప్రీక్వెల్ ను సెట్ చేశాడు. చాలా రోజులుగా ఈ సినిమా షూటింగు జరుపుకుంటోంది. ‘కాంతార’ చిన్న బడ్జెట్ సినిమా కావడం వలన, గ్రాఫిక్స్ ను పెద్దగా ఉపయోగించలేదు. ఈ సారి మాత్రం వీఎఫ్ ఎక్స్ ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. అందుకోసం కోసం భారీ బడ్జెట్ నే కేటాయించారట.

ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడు పూర్తవుతుందా .. ఎప్పుడు థియేటర్లకు వస్తుందా అనే ఆసక్తితో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయిందని సమాచారం. మరో 20 రోజులలో టాకీపార్టు మొత్తం పూర్తవుతుందని అంటున్నారు. ఆ వెంటనే పోస్టు ప్రొడక్షన్ పనులను మొదలుపెడతారని టాక్. వచ్చే వేసవిలో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారని చెబుతున్నారు. ఈ సినిమా మరో సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్