అఖిల్ స‌ర‌స‌న జాన్వీ క‌పూర్?

Crazy Combination: అక్కినేని అఖిల్ ప్ర‌స్తుతం ఏజెంట్ అనే భారీ స్పై థ్రిల్ల‌ర్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఆగ‌ష్టు 12న ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఇక ఈ సినిమా త‌ర్వాత అఖిల్.. బాలీవుడ్ మూవీ చేయ‌నున్నారు. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందే ఈ సినిమాను బాలీవుడ్ బ‌డా ఫిల్మ్ మేక‌ర్ క‌ర‌ణ్ జోహార్ నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది.

అయితే.. ఈ పాన్ ఇండియా మూవీలో అఖిల్ స‌ర‌స‌న అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. జాన్వీ క‌పూర్ ని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేయాల‌ని టాలీవుడ్  నిర్మాతలు ఎప్ప‌టి నుంచో ట్రై చేస్తున్నారు కానీ.. సెట్ కాలేదు. ఇప్పుడు అఖిల్ స‌ర‌స‌న న‌టించేందుకు ఓకే చెప్పింద‌ని.. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించి అఫిషియ‌ల్ అనౌన్స్ మెంట్ రానుంద‌ని స‌మాచారం. నాగార్జున‌, శ్రీదేవి క‌లిసి ‘ఆఖ‌రి పోరాటం’, ‘గోవిందా గోవింద‌’, ‘ఖుదాగ‌వా’ చిత్రాల్లో న‌టించారు. ఇప్పుడు వారి వార‌సులు అఖిల్, జాన్వీ క‌పూర్ క‌లిసి న‌టించ‌బోతుండ‌డం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *