Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్గర్వంగా ఉంది : కరణం మల్లీశ్వరి

గర్వంగా ఉంది : కరణం మల్లీశ్వరి

టోక్యో ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను రజత పతకం సాధించడం సంతోషంగా ఉందని ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కారణం మల్లీశ్వరి అన్నారు. చాలా రోజుల తరువాత వెయిట్ లిఫ్టింగ్ ఫ్యామిలీకి ఇది సంతోషకరమైన రోజుగా ఆమె అభివర్ణించారు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులకు ఇది ఎంతో స్ఫూర్తి ఇస్తుందని ఆమె అన్నారు.

2000 సంవత్సరం సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన కరణం మల్లీశ్వరిని ఇటీవలే కేజ్రివాల్ ప్రభుత్వం ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఉప కులపతిగా నియమించిన విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్ లో నేడు జరిగిన పోటీలో మన దేశానికి చెందిన మీరాబాయి 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రెండో స్థానంలో నిలిచి రజతం సాధించారు. దీనిపై కరణం స్పందించారు. 20 ఏళ్ళ తరువాత ఒలింపిక్స్ లో మరోసారి ఈ విభాగంలో పతకం రావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. తమ యూనివర్సిటీ లో వెయిట్ లిఫ్టింగ్ పై కూడా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.

మెడల్స్ గెలిచిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని, అయితే వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తే మరింత మంది క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తారని ఆమె వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్