Tuesday, January 28, 2025
HomeTrending NewsKarnataka: కర్ణాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు

Karnataka: కర్ణాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు

కర్ణాటక నూతన  ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పదవీ స్వీకార ప్రమాణం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఈ  కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.  సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ  సిఎంగా డీకే శివకుమార్‌తో పాటు మరో 8మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. పరమేశ్వర, మునియప్ప, కేసీ జార్జ్‌, ఎంబీ పాటిల్‌, సతీష్‌ జర్కోలీ, ప్రియాంక్‌ ఖర్గే, రామలింగారెడ్డి, జమీర్‌ ఖాన్‌లతో గవర్నర్‌  థాపర్ చాంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు

ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. వీరితో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‭గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు హాజరు అయ్యారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూఖ్ అబ్దుల్లా, మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, బిహార్ డీసీఎం తేజశ్వీ యాదవ్, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ.రాజా హాజరయ్యారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్