Saturday, January 18, 2025
Homeసినిమాజ‌క్క‌న్నమూవీలో మహేష్ కు విలన్ ఎవరు?

జ‌క్క‌న్నమూవీలో మహేష్ కు విలన్ ఎవరు?

Who’s that: సూపర్ స్టార్ మహష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొంద‌నుంద‌ని గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనా టైమ్ లో స్వ‌యంగా రాజ‌మౌళి ‘ఆర్ఆర్ఆర్’ త‌ర్వాత మ‌హేష్ బాబుతో సినిమా చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించ‌డంతో ఈ క్రేజీ అప్ డేట్స్ కోసం అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. అయితే… ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.
అది ఏంటంటే… ఈ సినిమాలో రెండు బలమైన నెగిటివ్ పాత్రలకి టాప్ స్టార్లని రంగంలోకి దించబోతున్నారుట. ఒక నెగిటివ్ రోల్ కి కోలీవుడ్ స్టార్ హీరో కార్తిని అనుకుంటున్నారుట. విజయేంద్ర ప్రసాద్ రాసిన పాత్రకి కార్తి అయితే పర్పెక్ట్ గా సూటవుతాడని భావిస్తున్నారట. యుగానికి ఒక్కడు సినిమాలో కార్తి పాత్ర జక్కన్న అనుకుంటోన్న రోల్ కి బాగా ఉపకరిస్తాయని అనుకుంటున్నార‌ట‌.

ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా హీరోకి ధీటుగా ఉంటుందని సమాచారం. ఇక మరో పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. బాలీవుడ్ హీరో పేరు బయటకు రాలేదు గానీ.. పేరున్న స్టార్ అయితే బాగుంటుందని భావిస్తున్నార‌ట‌. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ పై మరింత ఆస‌క్తి ఏర్ప‌డింది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ ను అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేస్తార‌ని స‌మాచారం. మ‌రి.. మ‌హేష్ తో జ‌క్క‌న్న ఏ రేంజ్ సెన్సేష‌న్  క్రియేట్ చేస్తారో చూడాలి.

Also Read : మ‌హేష్‌, రాజ‌మౌళి ప్రాజెక్ట్ ప్లానింగ్ మారిందా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్