Saturday, April 20, 2024
Homeసినిమాజనవరి 13న కార్తి ‘నా పేరు శివ-2’ విడుదల

జనవరి 13న కార్తి ‘నా పేరు శివ-2’ విడుదల

Naa Peru Shiva 2  : కోలీవుడ్ స్టార్ కార్తి కెరీర్ లో కీలక విజయాన్ని అందించిన సినిమా నాన్ మహాన్ అల్ల. 2010లో రిలీజైన ఈ లవ్ అండ్ యాక్షన్ ఫిల్మ్ తెలుగులో ‘నా పేరు శివ’గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక్కడా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. స్టూడియో గ్రీన్ పతాకంపై కె ఇ జ్ఞానవేల్ రాజా నా పేరు శివ చిత్రాన్ని నిర్మించారు. ఆవారా, యుగానికి ఒక్కడు లాంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మాత కె ఇ జ్ఞానవేల్ రాజా అభిరుచిని, ఆయన సినిమాల్లోని గ్రాండ్ మేకింగ్ వ్యాల్యూస్ ను చూపిస్తాయి.

కబాలి, సార్పట్ట పరంబరై వంటి చిత్రాలతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న పా రంజిత్ ‘నా పేరు శివ- 2 సినిమాను రూపొందించారు. ఇక ఈ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ప్రస్తుతం నా పేరు శివ 2 సినిమాను తెర పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్