Monday, June 15, 2026
Homeసినిమా'కార్తికేయ 2' హిట్టు ముగ్గురికీ ముఖ్యమే! 

‘కార్తికేయ 2’ హిట్టు ముగ్గురికీ ముఖ్యమే! 

నిఖిల్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో ‘కార్తికేయ’ ఒకటి. ఆ సినిమాకి సీక్వెల్ గానే ‘కార్తికేయ 2‘ రూపొందింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2019లో వచ్చిన ‘అర్జున్ సురవరం’ తరువాత నిఖిల్ నుంచి మరో సినిమా రాలేదు. అనుకోకుండానే ఇంత గ్యాప్ వచ్చేసింది .. ఆయనలో అసహనాన్ని పెంచేసింది. అందువలన ఈ సినిమా విడుదల కోసం .. దాని ఫలితం కోసం ఆయన చాలా ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తున్నాడు.

ఇక ‘కార్తికేయ’ హిట్ తోనే దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చందూ మొండేటి, ‘ప్రేమమ్’ రీమేక్ ను పక్కన పెడితే ఆ స్థాయి హిట్ ను అందుకోలేకపోయాడు. ‘సవ్యసాచి’ సినిమా ఫలితం ఆయనను మరింత నిరాశపరిచింది. అందువలన ‘కార్తికేయ’ మేజిక్ ను మళ్లీ  రిపీట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. మొదటి సినిమాకి మించిన ఆసక్తికరమైన పాయింట్ ను పట్టుకోవడమే కాదు, బడ్జెట్ కూడా భారీగానే పెట్టించాడు. ఫస్టు పార్టులో చేసిన స్వాతి అందుబాటులో లేకపోవడంతో, సెకండు పార్టులో ఆయన అనుపమను తీసుకున్నాడు.

ఇక అనుపమ విషయానికి వస్తే .. ‘అ ఆ’ .. ‘శతమానం భవతి’ వంటి హిట్స్ ఈ మధ్య కాలంలో పడలేదు. 2019లో వచ్చిన ‘రాక్షసుడు’ హిట్ కొట్టినా అది ఆమె ఖాతావరకూ రాలేదు. ఇక ఆ మధ్య చేసిన ‘రౌడీ బాయ్స్’ ఆమెను మరింత వెనక్కి తీసుకుని వెళ్లింది. ఒక వైపున కొత్త కథానాయికల నుంచి పోటీ  .. మరో వైపున వరించని విజయాలు. దీంతో ఈ బ్యూటీ చాలా డీలాపడిపోయింది. ’18 పేజెస్’ .. ‘బట్టర్ ఫ్లై’ లైన్లో ఉన్నప్పటికీ, ‘కార్తికేయ 2’ పైనే ఆశలు పెట్టుకుంది. కెరియర్ పరంగా హీరో హీరోయిన్లకు .. దర్శకుడికి కూడా ఈ సినిమాతో వచ్చే హిట్టు చాలా అవసరం. అలాంటి హిట్టును ఈ సినిమా పట్టుకుని పరిగెత్తుకు వస్తుందేమో చూడాలి.

Also Read : కార్తికేయ 2 ఆగస్ట్ 13న విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular