7.2 C
New York
Monday, December 11, 2023

Buy now

Homeసినిమా'కార్తికేయ 2' మేజిక్ 'స్పై'కి వర్కౌట్ అయ్యేనా?

‘కార్తికేయ 2’ మేజిక్ ‘స్పై’కి వర్కౌట్ అయ్యేనా?

నిఖిల్ ఎదుగుదలను చూస్తే అందుకోసం ఆయన పడిన కష్టం .. చేసిన కృషి కచ్చితంగా కనిపిస్తాయి. ఒక ప్రాజెక్టును సెట్ చేసుకున్న దగ్గర నుంచి అది మంచి అవుట్ పుట్ తో బయటికి వెళ్లే వరకూ తపించే హీరోగా ఆయన కనిపిస్తాడు. ఒక కథను ఓకే అనుకున్న దగ్గర నుంచి ఆ టీమ్ తో కలిసి ట్రావెల్ అవుతాడు. షూటింగు ఉన్నప్పుడు సెట్స్ కి వెళ్లడమే మన పని అని ఊర్కొనే హీరో కాదు ఆయన. ఈ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే.

‘కార్తికేయ 2’ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు. 100 కోట్ల హీరోగా మార్కులు కొట్టేశాడు. ఆ సినిమా వసూళ్ల విషయంలో ఈ రేంజ్ మేజిక్ జరుగుతుందని ఆయన కూడా గెస్  చేసుండడు. అందువల్లనే ఈ సారి కూడా ఆయన ‘స్పై’ సినిమాను పాన్ ఇండియా ముందుంచబోతున్నాడు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

అయితే ‘కార్తికేయ 2’ సినిమాలో శ్రీకృష్ణుడి లీల విశేషాలు ఎక్కడా లేకపోయినా, కథ అంతా కూడా ఆయన గురించే నడుస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడిని నార్త్ వారు మరింత ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అందువలన ఆ కంటెంట్ కి వారు బాగా కనెక్ట్ అయ్యారు. ఇదే మేజిక్ ‘స్పై’ విషయంలో జరుగుతుందా అనేదే ఆసక్తిని రేకెత్తించే అంశం. ఈ సినిమా కథాంశం అంత తేలికైనదేం కాదు. పైగా తనకి అలవాటు లేని భారీ యాక్షన్ సీన్స్ లోను కనిపించాడు.  కంటెంట్ తెలిసిన వారెవరైనా నిఖిల్ పెద్ద బాధ్యతను భుజానికెత్తుకున్నాడే అనే అనుకుంటారు. ఈ సినిమాతో ఆయన అక్కడ ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్