DSJ: ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం). నట్టికుమార్ దర్శకత్వం వహించారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై శ్రీమతి నట్టి లక్ష్మి సమర్పణలో నట్టి క్రాంతి ఐదు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషలలో ఈ చిత్రాన్ని జనవరి 28న థియేటర్లలో భారీగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా కథానాయిక నట్టి కరుణ చెప్పిన చిత్ర విశేషాలు ఆమె మాటల్లోనే…
నటిగా తొలి సినిమాకు ఎవరైనా ప్రేమకథలనే ఎంచుకుంటారు. అలా కాకుండా నటనకు పూర్తి అవకాశం వున్న పాత్రలు చేయడం అరుదు. అలాంటి పాత్ర చేయాలనే దెయ్యంతో సహజీవం చేశాను. ఈ కథలో కొంచెం లవ్ కూడా వుంటుంది. అలాగే యాక్షన్, అరుపులు, మిడిల్ క్లాస్ అమ్మాయిగా మరో కోణం కూడా ఈ కథలో కనిపిస్తుంది. నటనను ఎక్కడా నేర్చుకోలేదు. లాక్‌డౌన్ సమయంలో యూట్యూబ్‌లో కొన్ని సాంగ్స్ చేశాను. అది చాలా మందికి నచ్చింది. ఇది నా కోసం రాసిన కథ. షూటింగ్ ముందు కొద్ది రోజులు వర్క్‌షాప్ కూడా ఈ సినిమాకు చేశాను.
ఈ కథ హైదరాబాద్‌లో జరిగిన వాస్తవ కథ. అది సెస్సేషన్ న్యూస్ రూపంలో వచ్చింది. అయితే కథనంలో కొన్ని ట్విస్ట్ లు వుంటాయి. ఎవ్వరూ ఊహించని విధంగా వుంటాయి. ఇది లేడీ ఓరియెంటెడ్ పాత్ర. స్నేహితులు వుంటారు. అందులో కోటి కుమారుడు రాజీవ్ ఒకరు. నాకు జోడిగా ఎవరూ వుండరు. ఈ సినిమా చేయడమే ఛాలెంజింగ్. యాక్షన్ బాగా అనిపించింది. ఐదు అంతస్తుల నుంచి దూకడం, కారు మీద నిలబడి రోప్ లేకుండా కారు గిర్రున తిరుగుతుండడం ..వంటివి ఛాలెంజ్ గా అనిపించాయి.
ఈ సినిమాలో రెండు పాటలుంటాయి. నటనకంటే డాన్స్ చేయడం కష్టమనిపించింది. ఎందుకంటే కశ్మీర్‌లో మైనస్ డిగ్రీలలో సాంగ్ చేసేటప్పుడు కాళ్ళు సహకరించలేదు. ఫైనల్ అవుట్ పుట్ చూశాక. అందరూ మెచ్చుకున్నారు. మావారయితే నీకు కరెక్ట్ కథ అని కామెంట్ చేశారు. సినిమా చూశాక నటిగా నాకు సంతృప్తి నిచ్చింది. ఈ సినిమా తర్వాత కూడా లేడీ ఓరియెంటెడ్ పాత్రలే చేయాలనుకుంటున్నా. కొన్ని కథలు వింటున్నాను. ఈనెల 28న కథలు వింటానని చెప్పాను.
నేను ఏ సినిమా చూసినా అందులోని కథానాయికల హావభావాలను… స్మైల్, లుక్స్ పవర్‌ఫుల్‌గా ఎలా చూడాలి వంటివన్నీ పరిశీలిస్తాను. సాయిపల్లవి యాక్షన్ సీన్స్, అనుష్క బాడీలాంగ్వేజ్ నాకు ఇష్టం. నటిగా డ్రీమ్ రోల్ అనేది విజయశాంతి తరహాలో చేయాలని వుంది. నాన్నగారు, టెక్నీషియన్స్ అంతా తెలిసినవారు కావడంతో కెమెరాముందు ఎక్కడా బెరుకు అనిపించలేదు. నాన్నగారిలో నిక్కచ్చితనం, డెడికేషన్ నేను నేర్చుకున్న అంశాలు.
నిర్మాతగా, నటిగా వున్న నాకు దర్శకురాలు అవ్వాలనే ఆలోచన కూడా లేదు. ఈ సినిమాకు రవిశంకర్ బాణీలు సమకూర్చారు. దెయ్యం సినిమా కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ సంగీతం బాగుండాలి. దాన్ని బాగా సమకూర్చారు. ఈ కథలో అమ్మవారికి, దెయ్యం మధ్య వుండే సన్నివేశాలు హైలైట్ అవుతాయి. ఒక్కో సందర్భంలో ఒళ్ళు గగుర్పాటు కలిగిస్తూ ప్రేక్షకుడిని ఇన్‌వాల్వ్ చేస్తాయి. ఈ తరహా సినిమాలు చూసే ప్రేక్షకులకు అద్భుతంగా నచ్చే సినిమా అవుతుంది.
Also Read : ‘దెయ్యంతో సహజీవనం’ ట్రైలర్ రిలీజ్