నిర్మాత నట్టికుమార్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం) లో యాసిన్ నిజర్, రమ్య బెహ్రా పాడిన ‘మందార కన్నె మందార’ అనే అద్భుతమైన పాటను ఈ రోజు మ్యాంగో మ్యూజిక్  ద్వారా విడుదల చేశారు.

మంచి నాలెడ్జ్ తో బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు, వారు గతంలో చేసిన ఎన్నో మోసాలు గురించి తెలుసుకుని వారి పై ఆ అమ్మాయి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది అన్న కథాంశంమే ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం). అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై  నట్టి కుమార్ కుమార్తె కరుణ ప్రధాన పాత్ర పోషిస్తుండగా కుమారుడు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు మొదటి వారంలో 5 భాషల్లో విడుదల చేయడాన్ని సన్నాహాలు చేస్తున్నారు.

నట్టికుమార్ మాట్లాడుతూ… కాశ్మీర్ లోని  అద్భుతమైన అందాలతో 5 రోజులు షూట్ చేసిన ”మందార కన్నె మందార’ పాటను యాసిన్ నిజర్, రమ్య బెహ్రా పాడారు. ఈ పాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నాం. సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *