Monday, June 15, 2026
Homeసినిమాఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వచ్చిన 'కాసర్ గోల్డ్'

ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వచ్చిన ‘కాసర్ గోల్డ్’

బంగారంపై చాలామందికి విపరీతమైన వ్యామోహం ఉంటుంది. అందువల్లనే దానికి అంత డిమాండ్ ఉంటుంది. విదేశాల నుంచి బంగారం అక్రమంగా రవాణా జరగడానికి కారణం కూడా ఇదే. అందువల్లనే చాలా ముఠాలు .. పెద్ద మనుషుల ముసుగులో చెలామణి అవుతున్నవారు ఈ అక్రమ రవాణాలో తమ పాత్రను చాలా జాగ్రత్తగా పోషిస్తూ ఉంటారు. ఇక ఎవరి వాటా వారికి చేరుతూ ఉంటుంది గనుక, ఈ విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించే అధికారులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారు.

అలాంటి ఒక కంటెంట్ తో వచ్చిన మలయాళ సినిమానే ‘కాసర్ గోల్డ్’. ఈ మధ్యనే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా చూడొచ్చునా? అంటే .. చూడొచ్చు .. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ‘దుబాయ్’ నుంచి స్మగ్లింగ్ రూట్లో కొంత బంగారం కేరళ ప్రాంతానికి చేరుతుంది. అయితే ఆ బంగారాన్ని సొంతం చేసుకోవడానికి ఇద్దరు స్నేహితులు ప్లాన్ చేస్తారు. ఆ విషయంలో వాళ్లు సక్సెస్ అవుతారు. ఒకరు విలాసవంతమైన జీవితం కోసం బంగారంపై ఆశ పెంచుకుంటే, మరొకరు ఒక ఆపదలో నుంచి బయటపడటం కోసం ఆ బంగారంపై ఆశ పడతాడు.

అయితే ఎవరైతే ఆ బంగారాన్ని ‘దుబాయ్’ నుంచి తెప్పించారో, వాళ్ల ముఠా ఈ స్నేహితుల కోసం వెదకడం మొదలు పెడుతుంది. అవినీతి పరుడైన ఒక పోలీస్ ఆఫీసర్ కూడా  ఆ ముఠా ఈ పనిపై పంపిస్తుంది. వాళ్ల బారి నుంచి ఆ స్నేహితులు తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు .. వాళ్లు ఎదుర్కొనే ప్రమాదాలు .. చివరికి ఆ బంగారం ఎవరి సొంతమవుతుందనే ఆసక్తిని రేకెత్తిస్తూ ఈ కథ నడుస్తుంది. మొదటి నుంచి చివరి వరకూ ఇంట్రెస్టింగ్ గా సాగే ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular