Kashmir Files:’కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో పాన్ వరల్డ్ విజయాన్ని అందుకున్న అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐ యామ్ బుద్దా ప్రొడక్షన్‌ సంయుక్తంగా చరిత్రకు సంబంధించిన మరో రెండు గొప్ప కథలను వెండితెరపై చూపించబోతున్నారు. కాశ్మీరీ పండితులపై రూపొందించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ సినిమాని ఆకర్షించింది. నాటి పరిస్థితులను హృదయాన్ని కదిలించేలా తెర పై ఆవిష్కరించారు.

నిజాయితీగా చెప్పిన ఈ కథ కోట్లాది ప్రేక్షకులు మనసులను గెలుచుకుంది. ఇప్పుడు అంతే నిజాయితీతో వివేక్ రంజన్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి మరో రెండు కథలు వెండితెరపై చూపించాలని సంకల్పించారు. 250 కోట్ల క్లబ్‌లో చేరిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తూ ప్రదర్శింపబడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు ఈ చిత్రాన్ని అభినందించారు. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చే సినిమాల పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పల్లవి జోషి ఈ రెండు చిత్రాలను నిర్మించనున్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన విడుదలైంది. ఈ చిత్రాలకు సంబధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

Also Read : కాశ్మీర్ ఫైల్స్ ఫిల్మ్ మేకర్స్‌ని ఆశీర్వదించిన ప్రధాన మంత్రి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *